38 శాతం ఎగిసిన ఇండస్‌ ఇండ్‌ లాభం

12 Jul, 2019 17:02 IST|Sakshi

సాక్షి,ముంబై: ప్రయివేట్‌ రంగ సంస్థ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ క్యూ1 ఫలితాల్లో అదరగొట్టింది. శుక్రవారం విడుదల చేసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికం నికర లాభాలు 38  శాతం ఎగిసాయి.  రూ. 1432 కోట్ల లాభాలను వెల్లడించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) సైతం 34 శాతం పెరిగి రూ. 2844 కోట్లకు చేరింది. 

త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు)  స్వల్పంగా ఎగిసి  2.15 శాతంగా ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు సైతం 1.2 శాతం నుంచి 1.23 శాతానికి చేరాయి. అలాగే ప్రొవిజన్లు కూడా తగ్గాయి. మైక్రో ఫైనాన్స్‌ రంగ సంస్థ భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ను విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. బీఎఫ్‌ఐఎల్‌తో విలీనంతో విలీనాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నామనీ, ఈ త్రైమాసికంలో, బ్యాంక్ తన టాప్ లైన్ గ్రోత్‌తోపాటు ఆపరేటింగ్ లాభాలలో ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించిందని  బ్యాంకు సీఎండీ  రొమేష్‌ సోబ్టి తెలిపారు. తరువాతి త్రైమాసికాల్లో  ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో కొత్త అవకాశాలపై దృష్టిపెడతామని చెప్పారు. ఈ ఫలితాల నేపథ్యంలో  ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు షేరు  తీవ్ర ఒడిదుడకులకు లోనై చివరికి 2 శాతం నష్టంతో ముగిసింది. 

మరిన్ని వార్తలు