ఇండస్‌ఇంద్ బ్యాంక్ నికర లాభం 30 శాతం అప్

10 Oct, 2015 00:58 IST|Sakshi
ఇండస్‌ఇంద్ బ్యాంక్ నికర లాభం 30 శాతం అప్

* 20% పెరిగిన మొత్తం ఆదాయం
* తగ్గిన మొండి బకాయిలు

ముంబై: ప్రైవేట్ రంగంలోని ఇండస్‌ఇంద్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో 30  శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ. 430 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.560 కోట్లకు పెరిగిందని ఇండస్‌ఇంద్ బ్యాంక్ బీఎస్‌ఈకి నివేదించింది.

మొత్తం ఆదాయం రూ.2,973 కోట్ల నుంచి 20 శాతం  వృద్ధితో రూ.3,581 కోట్లకు చేరిందని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 1.08 శాతం నుంచి 0.77 శాతానికి, నికర మొండి బకాయిలు 0.33 శాతం నుంచి 0.31 శాతానికి తగ్గాయని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో తమ నికర లాభం 27 శాతం వృద్ధితో రూ.1,085 కోట్లకు,  మొత్తం ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.7,066 కోట్లకు పెరిగాయని ఇండస్‌ఇంద్ బ్యాంక్ తెలిపింది.

మరిన్ని వార్తలు