పరిశ్రమలు.. కకావికలం!

12 Oct, 2019 03:27 IST|Sakshi

ఆగస్టులో ఉత్పాదకత 1.1 శాతం క్షీణత

ఏడేళ్లలో అత్యంత     ఘోరమైన పనితీరు

క్యాపిటల్‌ గూడ్స్, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ పతనం

తయారీ, విద్యుత్, మైనింగ్‌ అన్నీ పేలవమే...

న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి ఆగస్టులో దారుణ పతనాన్ని నమోదు చేసుకుంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా –1.1 శాతం క్షీణత నమోదయ్యింది. ఉత్పత్తి క్షీణతలోకి జారడం రెండేళ్ల తరువాత ఇదేకాగా, అదీ ఇంత స్థాయిలో క్షీణత నమోదుకావడం ఏడేళ్ల తరువాత ఇదే తొలిసారి. 2012 నవంబర్‌లో ఐఐపీ –1.7 శాతాన్ని నమోదుచేసుకున్న తరువాత, ఇదే స్థాయి తీవ్ర ప్రతికూలత తాజా సమీక్షా నెల (2019 ఆగస్టు)లో చోటుచేసుకుంది. 2018 ఆగస్టులో ఐఐపీ వృద్ధిరేటు 4.8 శాతంగా నమోదయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలను
రంగాల వారీగా చూస్తే...

► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77 శాతం వెయిటేజ్‌ ఉన్న ఈ విభాగంలో  అసలు వృద్ధి నమోదుకాలేదు. –1.2 శాతం క్షీణత నెలకొంది. ఈ కీలక విభాగంలో ఇలాంటి ఫలితం చూడ్డం ఐదేళ్ల తరువాత (2014 అక్టోబర్‌లో –1.8 శాతం క్షీణత) తొలిసారి. 2018 ఆగస్టులో తయారీ విభాగంలో 5.2 శాతం వృద్ధి నమోదయ్యింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 15 ప్రతికూల ఫలితాలను నమోదు  చేసుకున్నాయి.  

► విద్యుత్‌: ఈ రంగంలో కూడా అసలు వృద్ధిలేకపోగా –0.9 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 ఆగస్టులో ఈ రంగం ఏకంగా 7.6 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.  

► మైనింగ్‌: ఈ విభాగంలో వృద్ధి రేటు యథాతథంగా 0.1 శాతంగా ఉంది.  

► క్యాపిటల్‌ గూడ్స్‌: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్‌లను సూచించే ఈ విభాగం ఉత్పత్తిలో కూడా అసలు వృద్ధిలేకపోగా భారీగా –21 శాతం క్షీణత నమోదయ్యింది. గత ఏడాది ఆగస్టులో ఈ విభాగంలో ఉత్పత్తి వృద్ధిరేటు 10.3 శాతంగా ఉంది.  

► కన్జూమర్‌ డ్యూరబుల్స్‌: రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటి దీర్ఘకాలం మన్నే ఉత్పత్తులకు సంబంధించి ఈ విభాగం కూడా –9.1 శాతం క్షీణత నమోదుచేసుకుంది. 2018 ఇదే నెల్లో ఈ విభాగంలో వృద్ధిరేటు 5.5 శాతంగా ఉంది.  

► ఇన్‌ఫ్రా/నిర్మాణం: పేలవ పనితనాన్ని ప్రదర్శించిన రంగాల్లో ఇది ఒకటి. ఈ విభాగంలో 8 శాతం వృద్ధి (2018 ఆగస్టు) రేటు  –4.5 శాతం క్షీణత (2019 ఆగస్టు)లోకి జారింది.  

► కన్జూమర్‌ నాన్‌–డ్యూరబుల్స్‌: సబ్బులు, సిగరెట్ల ఉత్పత్తి వంటి ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌కు సంబంధించిన ఈ విభాగంలో మాత్రం వృద్ధి 4.1 శాతంగా ఉంది. అయితే 2018 ఆగస్టులో ఈ విభాగంలో వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంది.  

► ఐదు నెలల్లోనూ డౌన్‌: పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు ఏప్రిల్‌–ఆగస్టు మధ్య 2.4%గా ఉంది. 2018 ఇదే కాలంలో ఈ వృద్దిరేటు 5.3 శాతం.  

రెండవ త్రైమాసికంపై నీలినీడలు...
‘ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్‌లో వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టం 5%కి పyì ంది. రెండో క్వార్టర్‌లో వృద్ధి   మెరుగుపడకపోవచ్చని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి’ అని ఆర్థికవేత్త  అదితి నయ్యర్‌ పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెప్పించిన ఇన్ఫీ!

ఇన్ఫోసిస్‌ ప్రోత్సాహకర ఫలితాలు

షాకింగ్‌ : భారీగా పడిపోయిన పారిశ్రామిక ఉత్పత్తి

ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితా : మళ్లీ ముఖేషే..

వారాంతంలో మార్కెట్లు సుఖాంతం

జియో వడ్డన : ఇంపార్టెంట్‌ అప్‌డేట్‌

టీసీఎస్‌కు ఫలితాల షాక్‌

ఉన్నట్టుండి అమ్మకాలు, 38వేల దిగువకు సెన్సెక్స్‌

భారీ లాభాల్లో మార్కెట్లు : బ్యాంక్స్‌, మెటల్ అప్‌

బిగ్‌‘సి’లో ‘వన్‌ప్లస్‌7టీ’ మొబైల్‌ విక్రయాలు

పావు శాతం దిగొచ్చిన రుణ రేట్లు

కియా తొలి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌

ఇండస్‌ఇండ్‌ లాభం రూ.1,401 కోట్లు

ఫోర్టిస్‌ మాజీ ప్రమోటర్‌ శివీందర్‌ అరెస్ట్‌!

టీసీఎస్‌.. అంచనాలు మిస్‌

కోపరేటివ్‌ బ్యాంకులకు చికిత్స!

అంచనాలు అందుకోని టీసీఎస్‌

జియో: ఎగబాకిన వోడాఫోన్‌, ఎయిర్‌టెల్‌ షేర్లు

తీరని కష్టాలు నగలు అమ్ముకున్న టీవీ నటి

పీఎంసీ స్కాం: భిక్షగాళ్లుగా మారిపోయాం

విస్తారా పండుగ సేల్‌: 48 గంటలే..

నష్టాల్లో మార్కెట్లు : టెల్కో జూమ్స్‌

కొత్త ‘టిగోర్‌ ఈవీ’ వచ్చింది...

దూసుకొచ్చిన ‘డ్రాగ్‌స్టర్‌’ కొత్త బైక్స్‌

ఎల్‌వీబీ, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ విలీనానికి ఆర్‌బీఐ నో

పోటీతత్వంలో 10 స్థానాలు దిగువకు భారత్‌

శరత్‌ మ్యాక్సివిజన్‌ విస్తరణ

భారత్‌పై ‘అంతర్జాతీయ మందగమనం’ ఎఫెక్ట్‌!

బుల్‌.. ధనాధన్‌!

పొదుపు ఖాతాలపై వడ్డీకి కత్తెర

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త కొత్తగా...

14 ఏళ్ల తర్వాత

కాంబినేషన్‌ సై?

ఏం జరిగిందంటే?

ఆ ముద్దుతో పోలికే లేదు

మోస్ట్‌ వాంటెడ్‌