ఉద్యోగులను తొలగించొద్దు.. వేతనాల్లో కోత పెట్టొద్దు 

25 Mar, 2020 04:10 IST|Sakshi

పరిశ్రమలకు నిపుణుల సూచన 

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా తీవ్ర స్థాయిలో ఆర్థిక మందగమనం ముప్పు నేపథ్యంలో కంపెనీలు మానవీయ కోణంలో నడవాలని, ఉద్యోగులను తొలగించడం లేదా వేతనాలకు కోత విధించడం చేయరాదని నిపుణులు సూచించారు. ఇప్పటికే లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా ఎన్నో రంగాల్లో,  ముఖ్యంగా తయారీ పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడడం వల్ల, వాటిల్లో పనిచేస్తున్న రోజువారీ వేతన కార్మికులకు ఉపాధి కోల్పోయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగుల భద్రతకు తమది పూచీ అంటూ, వారిని ఉద్యోగాల నుంచి తీసివేయకుండా దేశీ పరిశ్రమలు సందేశం పంపించాల్సిన తరుణమిది అని నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నో విభాగాల్లో ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా ఉద్యోగుల వేతన వ్యయాలను తగ్గించుకోకుండా చూడొచ్చని సూచించారు.

మరిన్ని వార్తలు