బ్యాన్‌ ఎఫెక్ట్‌: 11 కంపెనీల షేర్లు ఢమాల్‌

25 Sep, 2017 13:26 IST|Sakshi

సాక్షి, ముంబై: దలాల్‌ స్ట్రీట్‌లో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది.  శుక్రవారం నాటి బేరింగ్‌ ట్రెండ్‌ను కొనసాగించిన మార్కెట్లలో సోమవారం ఉదయం ట్రేడింగ్‌ ఆరంభ గంటలో   కీలక సూచీ సెన్సెక్స్‌ 300 పాయిం‍ట్లకు పైగా కుప్పకూలగా   నిఫ్టీ 50 కీలక వ్యూహాత్మక మద్దతు స్థాయి 9,900 కు దిగువకుచేరింది.

దీంతోపాటు ఎన్‌ఎస్‌ఈ నిషేధం  నేపథ్యంలోస్టాక్‌మార్కెట్‌ లో 11 షేర్లు భారీ పతనాన్ని నమోదు చేసింది.  ఆరంభంనుం‍చీ  ఇన్వెస్టర్ల అమ్మకాల  జోరు కొనసాగడంతో  ఇన్ఫిబీమ్, ఇండో కౌంట్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్  సహా 11 స్టాక్స్ నష్టపోయాయి. ముఖ్యంగా ఈ మార్కెటింగ్ సంస్థ ఇన్ఫీబీమ్ కౌంటర్‌ ఎన్ఎస్ఈ లో తొలుత ఒక దశలో ఏకంగా 39 శాతం కుప్పకూలింది.  ఇండియా సిమెంట్స్ 5 శాతం  ఇండో కౌంట్ ఇండస్ట్రీస్  6 శాతం పతనమైంది. ఆ తరువాత ఇన్ఫీబీమ్‌ కొన్ని నష్టాలను రికవర్ చేసుకుని నష్టాలను తగ్గించుకుంది. ఎఫ్అండ్ వో కాంట్రాక్టులలో ట్రేడింగ్ ను ఎన్ఎస్ ఈ నిషేధం కారణం గా  ఇన్వెస్టర్ల  అమ్మకాల వెల్లువ సాగింది.  మరోవైపు  ఇన్ఫీబీమ్ షేరు భారీ పతనం కారణంగా  పొజిషన్లు రోలోవర్ చేసుకుంటే పెనాల్టీ విధించనున్నట్లు ఎన్ఎస్ ఈ తెలియజేసింది.

బిఎమ్ఎల్, డిహెచ్ఎఫ్ఎల్, డిఎల్ఎఫ్, హెచ్డిఐఎల్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్, ఇండియా సిమెంట్స్, ఇన్ఫిబీమ్, జెఎస్డబ్ల్యు ఎనర్జీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్, వోక్హార్డ్  11 ​ కంపెనీల ట్రేడింగ్‌ నిషేధానికి గురయ్యాయి

మరిన్ని వార్తలు