డేటా పరిమితి, వేగాన్ని కస్టమర్లకు చెప్పాల్సిందే

1 Nov, 2016 00:13 IST|Sakshi
డేటా పరిమితి, వేగాన్ని కస్టమర్లకు చెప్పాల్సిందే

 టెల్కోలకు ట్రాయ్ ఆదేశం
 న్యూఢిల్లీ: మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్లాన్‌లకు సంబంధించి డేటా వినియోగ పరిమితిని కస్టమర్లకు తప్పకుండా తెలియజేయాలని టెలికం కంపెనీలను నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశించింది. అదేవిధంగా ‘పరిమితి దాటిన తర్వాత(ఫెయిర్ యూసేజ్ విధానం) కనెక్షన్ స్పీడ్ ఎంతకు తగ్గుతుందన్న విషయాన్ని కూడా వెల్లడించాలని స్పష్టం చేసింది. ఫెయిర్ యూసేజ్ ప్రకారం... ఉదాహరణకు ఒక కస్టమర్ అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకున్నాడనుకుందాం.
 
 నెట్ స్పీడ్ 2 ఎంబీపీఎస్ కంటే అధికంగా డౌన్‌లోడ్ పరిమితి 2 జీబీగా టెల్కో నిర్ణయిస్తే... సంబంధిత బిల్లింగ్ వ్యవధిలో కస్టమర్ వినియోగం ఈ పరిమితిని గనుక మించిపోతే, ఆటోమేటిక్‌గా మిగతా కాలానికి స్పీడ్‌ను టెల్కోలు తగ్గించేసే అవకాశం ఉంది. ఫిక్స్‌డ్(వైర్‌లైన్) బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లకు కూడా ఫెయిర్ యూసేజ్ పాలసీని వర్తింపజేశాక కనీస స్పీడ్ 512 కేబీపీఎస్ కంటే తగ్గకూడదని ట్రాయ్ తేల్చిచెప్పింది. టెల్కోలు డేటా లిమిట్ ఎంతవరకూ చేరిందనే(50%, 90%, 100%) సమాచారాన్ని కస్టమర్ల రిజిస్టర్డ్ మొబైల్ లేదా ఈ-మెయిల్‌కు పంపాల్సి ఉంటుంది.
 

మరిన్ని వార్తలు