భారీగా అక్రమాలకు తెరతీసిన ఇన్ఫోసిస్

21 Jun, 2017 19:17 IST|Sakshi
భారీగా అక్రమాలకు తెరతీసిన ఇన్ఫోసిస్
బెంగళూరు: ఓ వైపు ముంచుకొస్తున్న ఆటోమేషన్, మరోవైపు అమెరికా అధ్యక్షుడి ట్రంప్ ప్రభావంతో దేశీయ రెండో అతిపెద్ద టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్ అతిపెద్ద ఆక్రమణ యుద్ధానికి తెరతీసింది. ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడుతూ, ప్రత్యర్థ కంపెనీలకు ఝలకిస్తున్నట్టు పలు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. మార్చితో ముగిసిన 2017 ఆర్థికసంవత్సరంలో ఇన్ఫోసిస్ అక్రమంగా కాగ్నిజెంట్ నుంచి 13 మంది ఎగ్జిక్యూటివ్ లను, కాప్జెమినీ నుంచి 13 మందిని, టీసీఎస్ నుంచి ఐదుగుర్ని, విప్రో, ఐబీఎం, అసెంచర్, ఐబీఎంల నుంచి 8 మందిని తన కంపెనీలోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇతరులను హెచ్సీఎల్ టెక్నాలజీస్, జెన్సార్, టెక్ మహింద్రా, ఐటీసీ ఇన్ఫోటెల్ లనుంచి  నియమించుకుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
 
అయితే ప్రత్యర్థి కంపెనీల నుంచి ఎగ్జిక్యూటివ్ ల తీసుకోవడంపై స్పందించడానికి ఇన్ఫోసిస్ నిరాకరించింది. కాగ, మరికొన్ని రోజుల్లో ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సర తొలి క్వార్టర్ ఫలితాలను ప్రకటించనుంది.టెక్ దిగ్గజాలు ఒక కంపెనీ  ఉద్యోగులను మరో కంపెనీలకి తీసుకోవడం సాధారణమే. కానీ హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినతరం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ వీసాలపై ప్రతిభావంతులైన ఉద్యోగులనే తమదేశ కార్యాలయాల్లోకి తీసుకోవాలంటూ హెచ్చరికలు చేయడం కంపెనీ మరికొంత ఆక్రమణకు తెరతీసినట్టు తెలిసింది. గతేడాది ఇన్ఫోసిస్ అమెరికాలో 150 మంది టాప్-పెయిడ్ ఎగ్జిక్యూటివ్ లను నియమించుకుంటే, వారిలో సగానికి పైగా వ్యక్తులు ఇన్ఫోసిస్ ప్రత్యర్థి కంపెనీ వారేనని ఈటీ డేటాలో వెల్లడైంది. మరో రెండేళ్లలో ఇన్ఫోసిస్ అమెరికాలో 10వేల మందిని పైగా నియమించుకోనున్నట్టు పేర్కొంది.
 
ఇన్ఫోసిస్ తో పాటు మిగతా కంపెనీలు కూడా స్థానిక ఉద్యోగులను భారీగా నియమించుకోనున్నట్టు ప్రకటించాయి.  ప్రతిభావంతుల్ని దక్కించుకోవాలనే యుద్ధం కొత్తది కాదని, నైపుణ్యవంతుల కోసం తాము నిరంతరం పోటీపడుతూనే ఉంటామని ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు చెప్పారు. ప్రస్తుతం ఆన్ షోర్ లో గతంలో కంటే ఎక్కువగా టాలెంట్ ఉన్న ఉద్యోగులు కావాలన్నారు. ప్రతి కంపెనీ ప్రస్తుతం నియామకాలు చేపడుతుందని, ఒకవేళ ఆన్ షోర్ లో మంచిగా పనితీరు కనబరిస్తే ఇదే వారికి మంచి సమయని ఓ ఇండియన్ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. అయితే తాము ప్రత్యర్థి కంపెనీల వైపు కాకుండా, క్యాంపస్  నియామకాల వైపు ఎక్కువగా మొగ్గుచూపినట్టు పేర్కొన్నారు.  
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు