ఇన్ఫోసిస్‌ ప్రోత్సాహకర ఫలితాలు

11 Oct, 2019 20:39 IST|Sakshi

ముంబై : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌ క్వార్టర్‌లో సంస్థ మొత్తం రాబడి గత ఏడాది రూ 21348 కోట్లు కాగా ప్రస్తుత త్రైమాసంలో రూ 23,255 కోట్లుగా నమోదైంది. నికర లాభం 2.2 శాతం తగ్గి రూ 4019 కోట్లు ఆర్జించింది. రెవెన్యూ రాబడి, డిజిటల్‌ వృద్ధి, నిర్వహణ మార్జిన్లు, భారీ ప్రాజెక్టుల రాక, సిబ్బంది నిష్క్రమణ వంటి పలు రంగాల్లో సానుకూల వృద్ధిని సాధించామని ఇన్ఫోసిస్‌ ఎండీ, సీఈఓ సలీల్‌ పరేఖ్‌ పేర్కొన్నారు. రెండో క్వార్టర్‌లో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించి సరైన బాటలో సాగుతున్నామనేందుకు ఈ ఫలితాలు సంకేతమని వ్యాఖ్యానించారు. ఇన్ఫోసిస్‌ తమ వాటాదారులకు షేర్‌కు రూ 8 డివిడెండ్‌ను ప్రకటించింది. రెండో త్రైమాసంలో తాము అన్ని విభాగాలోల​ మెరుగైన వృద్ధిని కనబరిచామని, ఉద్యోగుల నిష్ర్కమణ కూడా తగ్గుముఖం పట్టిందని ఈ క్వార్టర్‌లో భారీ ఒప్పందాలు తమకు కలిసివచ్చాయని సీఎఫ్‌ఓ నీలంజన్‌ రాయ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు