క్యూ4లో అదరగొట్టిన ఇన్ఫీ : కొత్త సీఎఫ్‌వో

12 Apr, 2019 16:32 IST|Sakshi

సాక్షి,ముంబై : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. వార్షిక ప్రాతిపదికన 11శాతం వృద్ధిని నమోదు చేసింది. విశ్లేషకుల అంచనాలను బీట్‌  చేస్తూ ఈ క్వార్టర్లో 3,857 కోట్ల నికర లాభాలను  నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ.3690 కోట్లను సాధించింది.  అయితే గైడెన్స్‌ విషయంలో నిరాశపర్చింది.

శుక్రవారం మార్కెట్‌ ముగిసిన అనంతరం ప్రకటించిన క్యూ4 ఫలితాల్లో కాన్సిలిడేటెడ్‌  ప్రాతిపదికన రూ. 4078 కోట్లను నికర లాభాలను ఇన్ఫీ ప్రకటించిది.  ఆదాయం రూ. 21,539 కోట్లను సాధించింది.  అలాగే  కొత్త సీఎఫ్‌వోగా నిలంజన్‌ రాయ్‌ నియామకానికి ఇన్ఫీ బోర్డు ఆమోదం తెలిపింది. మార్చి 1, 2019నుంచి  ఆయన నియామకం అమల్లో ఉన్నట్టుగా పరిగణిస్తామని బీస్‌ఈ ఫైలింగ్‌లో  సంస్థ వెల్లడించింది.  ట్రాన్స్ఫర్మేషన్ ప్రయాణంలో మొదటి సంవత్సరం పూర్తి చేశామని  ఇన్ఫీ సీఈవో సలీల్‌ పరేఖ్‌  పేర్కొన్నారు.   

డివిడెండ్‌
షేరుకు 10.50 చొప్పున ప్రతి  ఈక్విటీ షేరుకు డివిడెండ్‌ను దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. 

మరిన్ని వార్తలు