అదరగొట్టిన ఇన్ఫీ : భారీ డివిడెండ్‌

13 Apr, 2018 17:02 IST|Sakshi

సాక్షి, ముంబై: సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌  క్యూ4 ఫలితాల్లో అంచనాలను మించిన  ఫలితాలను నమోదు చేసింది. మార్చితో ముగిసిన గతేడాది(2017-18) చివరి త్రైమాసిక ఫలితాలను  శుక్రవారం  ప్రకటించింది.  క్యూ4(జనవరి-మార్చి)లో ఇన్ఫోసిస్‌ ఏకీకృత నికర లాభం రూ. 3690 కోట్లను సాధించింది.   ఆదాయం 5.6 శాతం పెరిగి రూ .18,083 కోట్లకు చేరింది. క్యూ3 ఆదాయం రూ. 17794 కోట్లతో పోల్చితే 1.6 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఎబిటా మార్జిన్లు 24.3శాతంగా ఉన్నాయి.  డాలర్‌ ఆదాయం 2805  కోట్లుగాను, రూపాయి ఆదాయం రూ. 18,083 కోట్లుగాను ఉంది.   ఇన్ఫోసిస్‌  సీఈవోగా సలీల్‌  పరీఖ్‌ తన తొలి త్రైమాసిక ఫలితాలను  ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 2019 నాటికి స్కావా,  పనయాల విక్రయాల పూర్తి చేయాలని భావిస్తోందని వెల్లడించారు.  అలాగే రెవెన్యూ  గైడెన్స్‌ను కూడా7-9 శాతంగా నిర్ణయించినట్టు చెప్పారు. మరోవైపు  ఈక్విటీ షేరుకు 20.50 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది.   గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం డివిడెండ్‌ 30శాతం   ఎక్కువని ఇన్ఫీ  తెలిపింది.  కాగా  ఇవాల్టి మార్కెట్‌ ముగింపులో  ఇన్ఫోసిస్‌ షేరు స్వల్ప లాభాలతో రూ. 1168 వద్ద ముగిసింది.

>
మరిన్ని వార్తలు