ఇన్ఫీ మూర్తిపై మాజీ ఛైర్మన్‌ ధ్వజం

1 Sep, 2017 18:00 IST|Sakshi
ఇన్ఫీ మూర్తిపై మాజీ ఛైర్మన్‌ ధ్వజం

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌లో రగిలిన బోర్డ్‌ వివాదం ఇంకా రాజుకుంటూనే ఉంటుంది. తాజాగా  వ్యవస్థాపకుడు ఎన్‌.ఆర్‌. నారాయణమూర్తిపై సంస్థ మాజీ ఛైర్మన్‌ ఆర్‌ శేషసాయి మళ్లీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా  శేషసాయి హయాంలో ఇన్ఫీ పాలనాపరంగా విఫలమైందన్న మూర్తి వ్యాఖ్యలపై ఆయన  తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  తనపై మూర్తి  వ్యక్తిగత దూషణలకు దిగడం, అవాస్తవాలను, అభాండాలను వేయడం సరికాదని వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారుల  సమావేశంలో  ఆయన వ్యాఖ్యలు పూర్తిగా అసందర్బంగా ఉన్నాయని విమర్శించారు. తాను  నిజం చెప్పలేదని ఆరోపించడం సరియైంది కాదన్నారు. తాను ఇన్ఫోసిస్‌కు సంబంధించిన అన్ని  విషయాల్లో చాలా  నిజాయితీగా  వ్యహరించానని  శేష సాయి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆగస్టు 29న జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో మూర్తి ,  మాజీ చైర్మన్ శేషసాయిపై విమర్శలు చేసిన నేపథ్యంలో స్పందించిన ఆయన ఆ  ప్రకటన విడుదల చేశారు.  ఇన్ఫోసిస్‌ బోర్డుకు రాజీనామా చేసి నాటినుంచి బహిరంగంగా ప్రకటనలు చేయడం, రెచ్చగొట్టేలా మాట్లాడటం వంటి వాటికి  తాను దూరంగా ఉన్నానన్నారు. తద్వారా కంపెనీ పురోభివృద్ధినీకోరకున్నాననీ, ఈ వివాదాల వల్ల కంపెనీకి ఎలాంటి నష్టం జరగకూడదని తాను భావించానన్నారు.    మూర్తి వ్యాఖ్యలు కంపెనీ భవిష్యత్తు మంచిది కాదని హితవు పలికారు. అయితే దీనిపై ఇ‍న్ఫోసిస్‌ అధికారికంగా  స్పందించాల్సి ఉంది.
ఇన్ఫోసిస్‌  నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ నందన్‌ నీలకేని బాధ్యతలు స్వీకరించిన అనంతరం  నారాయణ మూర్తి  మంగళవారం,   పెట్టుబడిదారు సమావేశంలో మాట్లాడుతూ,  శేషసాయి నేతృత్వంలోని బోర్డు మాజీ సీఎఫ్‌వో  రాజీవ్ బన్సల్  అధిక వేతనం, చెల్లింపులపై  అసలు కారణం వివరించడంలో విఫలమైందని అరోపించారు.  శేషసాయి నేతృత్వంలో ఇన్ఫీ బోర్డు పాలన అత్యంత దారుణంగా ఉందని, మాజీ సీఎఫ్‌వో రాజీవ్‌ బన్సల్‌కు భారీగా ముడుపులు చెల్లించారని ఆరోపించారు.

కాగా ఇన్ఫోసిస్‌ సీఎండీగా విశాల్‌ సిక్కా రాజీనామా,  సంక్షోభం ,పీస్‌మేకర్‌ గా నందన్‌ నీలేకని రీ ఎంట్రీ,  బోర్డుప్రక్షాళన, బోర్డు  ఛైర్మన్‌ శేషాసాయి సహా ,ఇతర బోర్డు సభ్యులు కొంతమంది రాజీనామా చేయడం తెలిసిన  సంగతే.

 

మరిన్ని వార్తలు