ఆరోపణలపై ఇన్ఫోసిస్ వివరణ

4 Nov, 2019 13:42 IST|Sakshi

బెంగుళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై వచ్చిన ఆరోపణల్లో ప్రాథమిక ఆధారాలు లభించలేదని మరోసారి ఆ సంస్థ సీఈవో సలీల్ పరేఖ్ తెలిపారు. సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్‌వో నిలంజన్ రాయ్ లపై కొందరు ఉద్యోగులు(విజిల్ బ్లోయర్స్) తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఎథికల్ ఎంప్లాయిస్ పేరుతో ఏర్పడిన సంస‍్థలోని ఉద్యోగుల బృందం ఈ మేరకు ఇన్ఫోసిస్ డైరెక్టర్ల బోర్డుకు, అలాగే అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి కమిషన్ (ఎస్ఈసి) కి ఫిర్యాదు చేసిన విషయం విధితమే.

ఈ ఆరోపణలపై పరేఖ్ మాట్లాడుతూ అక్టోబర్‌లో కంపెనీ ఉద్యోగులు లేఖ వల్ల భారీ స్థాయిలో వాణిజ్య ఒప్పందాలు జరగలేదని అన్నారు. అర్థరహిత ఆరోపణల వల్ల కంపెనీ షేర్లు పడిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రశీదులను ఎందుకు బహిర్గతం చేయలేదని ఎన్ఎస్ఇ ప్రశ్నించిగా, ఆరోపణలు రుజువు చేయడానికి ఆధారాలు లభించలేదని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ)కి రాసిన లేఖలో ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. భారత రెగ్యులేషన్‌ చట్టం ప్రకారం అర్థరహిత ఆరోపణలు వచ్చినంత మాత్రాన కంపెనీ సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం లేదని ఇన్ఫోసిస్ తెలిపింది. 

మరిన్ని వార్తలు