ఇన్ఫోసిస్‌‌తో జర్మనీ కంపెనీ జోడీ

20 Jul, 2020 19:40 IST|Sakshi

బెంగుళూరు: దేశీయ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ జర్మనీ కెమికల్‌ కంపెనీ లాన్‌క్సెస్‌తో జోడీ కట్టనుంది. రసాయనాల తయారీ, రీసెర్చ్‌లతో జర్మనీ‌లో లాన్‌క్సెస్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఐటీ డిజిటలైజేషన్‌ ప్రక్రియలో ఇన్ఫోసిస్‌‌ లాన్‌క్సెస్‌కు కీలక సహకారం అందించనుంది. కాగా తమ ఉద్యోగులు 33దేశాలలో సేవలందిస్తున్నారని, వివిధ సమస్యలను పరిష్కారానికి డిజిటలైజేషన్‌ కీలక పాత్ర పోషిస్తుందని జర్మనీ‌ సంస్థ తెలిపింది.  లాన్‌క్సెస్‌ సంస్థ ఉద్యోగులకు కృత్రిమ మేధ(Artificial Intelligence) నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఇన్ఫోసిస్‌ పేర్కొంది

అయితే తమ రెండు సంస్థల కలయిక వల్ల ప్రపంచంలోనే లాన్‌క్సెస్‌ ఉద్యోగులు అత్యుత్తమ ప్రతిభ  కనిబరుస్తారని ఇన్ఫోసిస్‌‌ ఆశాభావం వ్యక్తం చేసింది. తమ భాగస్వామ్యం వల్ల ప్రపంచంలోనే లాన్‌క్సెస్‌ సంస్థ డిజిటల్‌ పరంగా, భవిష్యత్తులో కీలక సేవలందిస్తుందని ఇన్ఫోసిస్‌‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జస్మీత్‌ సింగ్‌ తెలిపారు. మరోవైపు ఇన్ఫోసిస్‌‌తో భాగస్వామ్యం వల్ల లాన్‌క్సెస్‌ సంస్థ సేవలు మరింత విస్తరిస్తుందని లాన్‌క్సెస్‌ సీఈవో కై ఫిన్కే పేర్కొన్నారు. (చదవండి: ఇన్ఫోసిస్‌లో ఎగిసిన కరోడ్‌పతి ఉద్యోగులు)

మరిన్ని వార్తలు