ఇన్ఫీకి ఒక మిలియన్‌ డాలర్ల జరిమానా

24 Jun, 2017 12:22 IST|Sakshi
ఇన్ఫీకి ఒక మిలియన్‌ డాలర్ల జరిమానా

న్యూఢిల్లీ: న్ఫోసిస్ వీసా  ఉల్లంఘన  వివాదాన్ని దేశీయ ఐటీ దిగ్గజం  ఇన్ఫోసిస్‌ పరిష్కరించుకుంది. ఈ నేపథ్యంలో  ఇన్ఫోసిస్  అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ జస్టిస్‌కు  1 మిలియన్ డాలర్లను  (సుమారు 6కోట్లు) చెల్లించనుంది. ఈ కేసు పరిష్కారానికి 2013లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ భారీ మొత్తాన్ని న్యూయార్క్‌కోర్టుకు చెల్లించనుంది.   దీంతో రెండు పార్టీలు దీర్ఘకాలిక వ్యాజ్యాన్ని రద్దు చేసుకోనున్నాయని  ఇన్ఫోసిస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

మిలియన్ డాలర్ల పరిష్కారంతో ఈ కేసు దర్యాప్తును ముగించడానికి నిర్ణయించామని న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎరిక్ టీ షీనిడెర్మాన్  శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా వాసుల ప్రయోజనాలకు భిన్నంగా  కంపెనీలు తమ చట్టాలను ఉల్లంఘించడాన్ని తాము అనుమతించమనీ  అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. ఇన్ఫోసిస్ వార్షిక సమావేశానికి ముందు రోజు ఈ  ప్రకటన రావడం విశేషం.

హెచ్1బీ వీసాలకు బదులుగా చౌకగా ఉండే బిజినెస్ విజిట్ వీసాలు(బీ1) తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా క్లయింట్లకు సేవలు అందిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. తద్వారా అమెరికాలో క్లయింట్లకు సర్వీసులు అందించిందనేది ఇన్ఫీపై ఆరోపణ.  వీసాల దుర్వినియోగం ఆరోపణలపై విచారణ ఎదుర్కొన్న ఇన్ఫోసిస్ తామెలాంటి దుర్వినియోగానికి పాల్పడలేదని ఇన్ఫీ స్పష్టం చేసింది.  దీనిపై 2011లో విచారణ 2013లో సెటిల్మెంట్ జరిగింది. సుమారు 3.4 కోట్ల డాలర్లు (రూ.215కోట్లు) చెల్లించాలనే సెటిల్మెంట్ చేసుకోవడం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు