ఈ 'పార్టీ'ని అందరూ వదిలేస్తున్నారు

17 Apr, 2014 18:52 IST|Sakshi
ఈ 'పార్టీ'ని అందరూ వదిలేస్తున్నారు

రాజకీయంగా ఇది పార్టీలు మారే సీజన్. కానీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు బాగా పేరు మోసిన, మోస్ట్ స్టేబుల్ ఇన్ఫోసిస్ ను రాజకీయ పార్టీని వదిలేసినట్టు వదిలేస్తున్నారు. దేశంలోని టాప్ సాఫ్ట్ వేర్ కంపెనీకి ఇది క్రైసిస్ కాలం.


గత ఏడాది కాలంలో ఇన్ఫీ నుంచి 36268 మంది బయటకు వెళ్లిపోయారు. అంతే 18.7 శాతం మంది సంస్థకు రాం రాం చెప్పారన్నమాట. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శిబులాల్ స్వయంగా అంగీకరించారు. తమాషా ఏమిటంటే ఆయన కూడా ఇన్ఫీకి గుడ్ బై చెప్పేందుకు తట్టా బుట్టా సర్దుకుంటున్నారు.


సంస్థను వదిలిన వారిలో కేవలం 1.5 శాతం మందిని కంపెనీ తనంతట తానుగా తీసేసింది. మిగిలిన వారంతా తమకు తాముగా వదిలేసినవారే. బాలకృష్ణన్ వంటి సీనియర్ ఉద్యోగులు రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన దక్షిణ బెంగుళూరు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున లోకసభకు పోటీ చేస్తున్నారు. దీంతో ఉద్యోగులు వదిలిపెట్టేసి పోకుండా ఉండేందుకు ఇన్ఫోసిస్ ప్రోత్సాహకాలు ప్రకటించింది. అయినా వలసలు ఆగడం లేదు.

మరిన్ని వార్తలు