హైదరాబాద్‌లో ఇన్నోవ్యాప్టివ్‌  అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం

26 Mar, 2019 00:20 IST|Sakshi

గచ్చిబౌలి: హైదరాబాద్‌ నగరంలో అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాన్ని ఇన్నోవ్యాప్టివ్‌  గ్లోబల్‌ సొల్యూషన్స్‌ సంస్థ  సోమవారం ప్రారంభించింది. ఈ సంస్థ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం, టెక్నికల్‌ సర్వీస్‌ సెంటర్‌ను సైయింట్‌ చైర్మన్‌ బి.వి. మోహన్‌రెడ్డి  ప్రారంభించారు.  ఇన్నోవ్యాప్టివ్‌ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ సంస్థ దేశీయంగా తమ వాణిజ్యాన్ని అభివృద్ధి పర్చాలని మోహన్‌ రెడ్డి సూచించారు. వినియోగదారులకు సేవలందించడంలో సాంకేతికత, నాణ్యత, నైపుణ్యత, విశ్వాసం, సమయ పాలన, మార్కెట్‌ మెళకువలు, నూతన ఆవిష్కరణలు, కాస్ట్‌ ఎఫెక్టివ్‌ నెస్‌ అనే అంశాలు అత్యంత కీలకంగా మారుతాయన్నారు. ఇన్నోవ్యాప్టివ్‌ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ సహా వ్యవస్థాపకులు, ముఖ్య కార్య నిర్వహణాధికారి సందీప్‌  రవండే మాట్లాడుతూ  5 మిలియన్‌ డాలర్లతో  ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో 150 వర్కింగ్‌ స్టేషన్లతో  గ్లోబల్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ను ప్రారంభించామన్నారు.

త్వరలో హైదరాబాద్, బెంగుళూర్‌ నగరాలలో మరో మూడు మిలియన్‌ డాలర్ల వ్యయంతో లోకోడ్, నో– కోడ్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇన్నోవ్యాప్టివ్‌ సంస్థ ప్రస్తుతం ఆమెరికాలోని హోస్టర్‌లో  కేంద్ర కార్యాలయాన్ని  కలిగి ఉందని పేర్కొన్నారు.  కేంద్రం కార్యాలయంతో పాటు 16 దేశాల్లో సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తోందన్నారు. ఇన్నోవ్యాప్టివ్‌  గ్లోబల్‌ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రసిడెంట్‌ అభిషేక్‌ పరకాల, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ అమర్‌ప్రతాప్, హెచ్‌ఆర్‌ అండ్‌ ఆపరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ అమన్‌ తో పాటు పలువురు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు