ఆ ఫీచర్‌ తొలగించిన క్రేజీ యాప్స్‌

10 Mar, 2018 17:52 IST|Sakshi
instagram and snapchat

న్యూయార్క్‌: ప్రముఖ మేసేజింగ్‌ యాప్స్‌ ఇన్‌స్టాగ్రాం, స్నాప్‌చాట్‌లు సంచలన నిర్ణయం తీసుకున్నాయి.యూజర్ల మనోభావాలను దెబ్బతీస్తున్నాయానే అంచనాలతో కీలక ఫీచర్‌ను తాత్కాలికంగా తొలగించేందుకు నిర్ణయించాయి. తద్వారా  తమ  సేవలు యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండాలని భావిస్తున్నట్లు తెలిపాయి.

ఫోటోలు, వీడియోలు షేరింగ్‌  యాప్స్‌ ఇన్‌స్టాగ్రాం, స్నాప్‌చాట్‌లలో టెక్ట్స్ కు బదులుగా సందేశాన్ని తెలియజేసే జిఫ్‌ (జిఫ్ఫి) లు వివక్షను, జాత్యాంహకారాన్ని సూచించేవిగా ఉన్నందువల్ల వాటిని తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. వీటి వల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందనీ,  ఇటీవల తమ సర్వేలో  తేలిందని వెల్లడించాయి.  వీటీపై కొంతమందితో సర్వే నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెండు సంస్థలు తెలిపాయి. ఈ నిర్ణయంపై స్పందించిన వినియోగదారులు తమ వ్యక్తిగత వివరాల భద్రతకు తీసుకుంటున్న చర్యలు కూడా వివరిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు