ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

5 Jun, 2020 11:26 IST|Sakshi

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ సదుపాయం

స్విగ్గీ, జోమాటోతో భాగస్వామ్యం

ఫుడ్ ఆర్డర్ స్టిక్కర్స్‌ విడుదల

సోషల్‌ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌ తమ వినియోదారులకు ఫుడ్‌ డెలీవరీ సదుపాయాన్నికల్పించనుంది. అంటే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఇక నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవచ్చు అన్నమాట. కరోనా నేపథ్యంలో చిన్న రెస్టారెంట్లను ఆదుకునేందుకు, తామను తాము మెరుగుపరుచుకోడానికి ఫుడ్‌ డెలీవరీ సంస్థలు స్విగ్గీ, జోమాటోతో భాగస్వామ్యం అవుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ గురువారం వెల్లడించింది. ఇందుకు వినియోగదారులు ఆహారాన్ని ఆర్డర్ చేసుకోడానికి ప్రత్యేక ఫుడ్ ఆర్డర్ స్టిక్కర్లను సైతం ఇన్‌స్టాగ్రామ్ విడుదల చేసింది. ఈ విషయంపై ఈ- కామర్స్‌, రిటైల్‌ ఇండస్ట్రీ హెడ్‌ నితిన్‌ చోప్రా మాట్లాడుతూ.. "చిన్న వ్యాపారాలు కొనసాగడానికి, కస్టమర్‌లతో సన్నిహితంగా ఉండటానికి మా వంతు కృషి చేయాలనుకుంటున్నాము. ముఖ్యంగా ఫుడ్‌ ఇండస్ట్రీ కోసం, మేము ఫుడ్ ఆర్డర్ స్టిక్కర్‌ను రూపొందిస్తున్నాము. స్విగ్గీ, జోమాటోతో భాగస్వామ్యం కావడం మాకు సంతోషంగా ఉంది.’ అని ఓ ప్రకటనలో పేర్కొ‍న్నారు. (స్విగ్గీ, జొమాటో డ్రోన్‌ డెలివరీ..)

అయితే ఫుడ్ ఆర్డర్ స్టిక్కర్‌ను ఉపయోగించడానికి, రెస్టారెంట్లు, హోటళ్లు ఇన్‌స్టాగ్రామ్ లేటెస్ట్‌ వెర్షన్‌ను కలిగి ఉండాలి. దీంతో చిన్న స్థాయి రెస్టారెంట్లు తమ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో సంస్థ కొత్తగా ప్రారంభించిన ఫుడ్ ఆర్డర్ స్టిక్కర్‌లను షేర్‌ చేసుకోవచ్చు. వినియోగదారులు తమ ఇన్‌స్టా స్టోరీ, ప్రొఫైల్‌లో స్విగ్గీ, జోమాటో లింక్‌ను షేర్‌ చేసుకోవచ్చు దీని వల్ల వినియోగదారులు స్విగ్గీ, జోమాటో ద్వారా ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోడానికి ఉపయోగపడుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులు తమ స్టోరీలలో జోమాటో,స్విగ్గీకి లింక్‌తో స్టిక్కర్‌లను పంచుకోవడం ద్వారా చిన్న తరహా వ్యాపారాలకు సహాయం చేయడంతోపాటు ఎక్కువ మంది రెస్టారెంట్లకు చేరడానికి సహాయపడుతుందని స్విగ్గీ పేర్కొంది. (అమెజాన్ డీల్ : ఎయిర్‌టెల్‌ క్లారిటీ)

మరిన్ని వార్తలు