టిక్‌టాక్‌ బ్యాన్‌ : ‘రీల్స్‌’ వచ్చేసిందట!

6 Jul, 2020 17:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టిక్​టాక్​ సహా 59 చైనా యాప్​లను  నిషేధం  తర్వాత దేశీయంగా అదే తరహా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పోటీ పెరిగింది. టిక్​టాక్​కు భారత మార్కెట్‌లో ఉన్ నక్రేజ్‌ను సొమ్ము చేసుకునేందుకు దిగ్గజ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఈ రేసులోకి సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌​ సొంతమైన ఇన్​స్టాగ్రామ్ కూడా చేరిపోయింది .టిక్‌టాక్‌పై నిషేధంతో దాని యూజర్లందరూ చింగారి, రోపోసో ప్లాట్‌ఫామ్‌లవైపు మొగ్గు చూపుతున్న తరుణంలో  ఇన్‌స్టా  వేగం పెంచింది.

టిక్​టాక్​ లాంటి ఫీచర్లతో ఇన్‌స్టాగ్రామ్ తన 15 సెకన్ల చిన్న వీడియో ఫీచర్ ‘రీల్స్’ ను పరీక్షిస్తున్నట్లు సమాచారం. టిక్‌టాక్ మాదిరిగానే, రీల్స్ వినియోగదారులను ఆడియో క్లిప్‌లతో 15-సెకన్ల వీడియోలను, స్టోరీలను యాడ్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది యూజర్లకు రీల్స్‌ కు సంబంధించిన అప్‌డేట్స్‌ అందుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే రీల్స్‌ను నవీకరిస్తున్నామని ధృవీకరించిన ఫేస్‌బుక్‌ నిర్దిష్ట వివరాలను వెల్లడించడానికి నిరాకరించింది.  (టిక్‌టాక్‌ బ్యాన్‌.. దూసుకుపోతున్న చింగారీ)

గత ఏడాది బ్రెజిల్‌ లో లాంచ్‌ చేసిన ఈ యాప్‌ను ఆ తరువాత ఫ్రాన్స్‌,  జర్మనీ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా టిక్‌టాక్‌ను పోలిన తన  లాస్సో యాప్‌ను  జూలై 10 నుంచి మూసివేస్తున్నట్లు ఫేస్‌బుక్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా