గృహ రుణాల వడ్డీ రాయితీపై శుభవార్త!

22 Sep, 2017 20:03 IST|Sakshi
గృహ రుణాల వడ్డీ రాయితీపై శుభవార్త!

సాక్షి, న్యూఢిల్లీ:  గృహరుణాలపై కేంద్ర ప్రభుత్వం మధ్య ఆదాయ వర్గాల  వారికి శుభవార్త అందించింది.  ఈ పథకం కింద గృహ రుణాలపై  ఇచ్చే వడ్డీ సబ్సిడీని మరో 15నెలలపాటు కొనసాగించేందుకు నిర్ణయించింది.  మధ్యతరగతి (ఎంఐజి) లబ్ధిదారులకు   రూ. 2.60 లక్షల వరకు  అందించే వడ్డీ సబ్సిడీని  మార్చి , 2019 వరకు పొడిగించింది.   ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) క్రింద ఎంఐజి లబ్ధిదారులకు వడ్డీ రాయితీ లభిస్తుందని గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా తెలిపారు.  'రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టర్స్ సమ్మిట్'లో ప్రసంగించిన మిస్రా ఈ శుభవార్త అందించారు.  

2022 నాటికి పట్టణ ప్రాంతాల్లో  'హౌసింగ్ ఫర్ ఆల్'లక్ష్య సాధనలో ప్రభుత్వం  నిబద్ధతను మిశ్రా పునరుద్ఘాటించారు. అలాగే  సరసమైన గృహాలలో పెట్టుబడులు పెట్టమని ప్రైవేటు రంగాన్ని  కోరారు.  అనేక ప్రోత్సాహకాలు,  రాయితీలతో భారీగా  ప్రోత్సాహం ఇస్తోందన్నారు. సీఎల్‌ఎస్‌ఎస్‌ (మధ్య ఆదాయ గ్రూపుల ఎంఐజీ)  కోసం ప్రకటించిన గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకం కింద రూ. 6 లక్షల పైబడిన వార్షిక ఆదాయం కలిగిన ఎంఐజీ లబ్ధిదారులు,  20సంవత్సరాల రూ.12 లక్షల వరకు రుణంపై నాలుగు శాతం వడ్డీ రాయితీ పొందుతారు. రూ.12 వార్షిక ఆదాయం ఉన్నవారు  రూ.18లక్షల రుణాలపై  వడ్డీ సబ్సిడీ 3శాతం  లభిస్తుంది.

కాగా క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ స్కీమ్‌ను (సీఎల్‌ఎస్‌ఎస్‌–ఎంఐజీ) ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది డిసెంబర్‌ 31న ప్రకటించారు.ఈ వడ్డీ సబ్సిడీ పథకం ఈ ఏడాది డిసెంబర్‌వరకు అమల్లో ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  వెల్లడించిన   సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు