ఇండిగో షేర్లు భారీగా క్రాష్‌

31 Jul, 2018 13:08 IST|Sakshi
ఇండిగో విమానం (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : అతిపెద్ద దేశీయ వాహకం ఇండిగో ఆపరేటర్‌ ఇంటర్‌ గ్లోబెల్ ఏవియేషన్‌ క్యూ1 ఫలితాల్లో భారీగా పడిపోయింది. విదేశీ మారకం, అధిక ఇంధన ధరలతో ఇండిగో క్యూ1 నికర లాభం ఏకంగా 96.6 శాతం మేర క్షీణించింది. దీంతో ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ కంపెనీ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో భారీగా క్రాష్‌ అయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి 11 శాతానికి పైగా పతనమైన ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలను తాకాయి. 

ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 11.26 శాతం పతనమైన ఈ కంపెనీ స్టాక్‌ రూ.891.10 వద్ద బీఎస్‌ఈలో 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. ఎన్‌ఎస్‌ఈలో కూడా ఈ కంపెనీ షేర్లు 11.39 శాతం మేర క్షీణించి, ఏడాది కనిష్ట స్థాయిల వద్ద రూ.890.55గా నమోదయ్యాయి. ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ సోమవారమే తన జూన్‌ క్వార్టర్‌ ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాల్లో విదేశీ మారకం, పెరుగుతున్న ఇంధన ధరలు, అధికమవుతున్న నిర్వహణ ఖర్చులు తమ లాభాలపై ప్రభావం చూపినట్టు పేర్కొంది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఈ బడ్జెట్‌ క్యారియర్‌ రూ.811.10 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. 

మరిన్ని వార్తలు