హైదరాబాద్‌ లో ఇన్వెస్కో ఇన్నోవేషన్‌ హబ్‌

11 May, 2017 03:22 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వివిధ దేశాల్లో ఇన్వెస్ట్‌ మెంట్‌ సేవలందిస్తున్న ఫైనాన్షియల్‌ దిగ్గజం ఇన్వెస్కో... టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు హైదరాబాద్‌లో తమ తొలి గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ను ఆరంభించింది. ఫైనాన్షియల్‌ టెక్నాలజీ తదితర విభాగాల్లో   ఉద్యోగులు, స్టార్టప్‌ల వినూత్న ఐడియాలను ప్రోత్సహించేందుకు ఈ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు సంస్థ సీటీవో డోనీ లోచన్‌ తెలిపారు.

 మంగళవారం దీన్ని ఆరంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘హబ్‌ ఆరంభం సందర్భంగా 24 గంటల పాటు అంతర్గతంగా మా ఉద్యోగుల కోసం హ్యాకథాన్‌ నిర్వహిస్తున్నాం. దీన్లో సుమారు 600 మంది పాల్గొంటున్నారు’’ అని తెలిపారు. ప్రస్తుతం ఇన్వెస్కో దాదాపు 835 బిలియన్‌ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తోందని, 6 వేల మంది పైచిలుకు ఉద్యోగులున్నారని సంస్థ గ్లోబల్‌ హెడ్‌ (స్ట్రాటెజీ ఇన్నోవేషన్‌ అండ్‌ ప్లానింగ్‌ విభాగం) డేవ్‌ డోసెట్‌ వివరించారు. భారత్‌లో 1100 మంది దాకా సిబ్బంది ఉన్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు