రియల్టీలోకి పెట్టుబడుల ప్రవాహం..

29 Jul, 2019 11:48 IST|Sakshi

ప్రథమార్ధంలో దాదాపు రూ. 18,900 కోట్ల నిధులు

ముంబై: నియంత్రణ విధానాలపరమైన ప్రతికూల పరిస్థితులతో రియల్టీ రంగం కార్యకలాపాలు మందకొడిగా ఉన్నప్పటికీ.. పెట్టుబడులు మాత్రం భారీగానే వస్తున్నాయి. 2019 ప్రథమార్ధంలో 2.7 బిలియన్‌ డాలర్ల మేర (దాదాపు రూ. 18,900 కోట్లు) వచ్చాయని ప్రాపర్టీల నిర్వహణ సంస్థ వెస్టియాన్ , పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 2015–2018 మధ్యకాలంలో రియల్టీలోకి పెట్టుబడుల ప్రవాహం 25.7 బిలియన్‌ డాలర్ల స్థాయిని తాకింది. అదే సానుకూల ధోరణులు 2019 ప్రథమార్ధంలోనూ కొనసాగాయని నివేదిక వివరించింది. మౌలిక సదుపాయాల కల్పన, రహదారులను మెరుగుపర్చడం తదితర చర్యలు చేపడితే ఈ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. గడిచిన దశాబ్దకాలంగా రియల్‌ ఎస్టేట్‌లోకి సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు .. ముఖ్యంగా ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ గణనీయంగా పెరిగాయని నివేదిక పేర్కొంది. సంస్థాగత పెట్టుబడుల్లో దాదాపు 80 శాతం వాటా పీఈ ఇన్వెస్టర్లదే ఉందని..ఇలాంటి అంశాలే రియల్టీ రికవరీపై ఆశల్ని సజీవంగా ఉంచుతున్నాయని వివరించింది.

మరిన్ని వార్తలు