మోదీ 2.0 ఏడాది పాలన: రూ.27లక్షల కోట్లను కోల్పోయిన ఇన్వెస్టర్లు

30 May, 2020 15:54 IST|Sakshi

దేశ జీడీపీలో 13.5శాతం ఆవిరి 

ప్రతి 10స్టాకుల్లో 9 స్టాకులు నెగిటివ్‌ రిటర్న్‌లే..! 

ప్రభుత్వ పనితీరుకు మార్కెట్‌ క్యాప్‌ ప్రామాణికం కాదంటున్న నిపుణులు

నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఈ ఏడాది కాలంలో దలాల్‌ స్ట్రీట్‌ ఏకంగా రూ.27లక్షల కోట్ల సంపదను కోల్పోయినట్లు గణాంకాలు చెబుతాయి. హరించుకుపోయిన ఈ మొత్తం ధనం దేశ జీడీపీలో 13.5శాతంగా ఉంది. కోవిడ్‌ సంక్షోంభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఇటీవల కేంద్ర ప్రకటించిన రూ.20లక్షల కోట్ల పోలిస్తే 35శాతం ఈ మొత్తం విలువ అధికం. ఇదే ఏడాదిలో ప్రతి 10స్టాకుల్లో 9 స్టాకులు నెగిటివ్‌ రిటర్న్‌లను ఇచ్చాయి. ఇదే సమయంలో బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల్లో కేవలం 10శాతం కంపెనీల షేర్లు మాత్రం రెండంకెల ఆదాయాలను ఇచ్చాయి. 


మోదీ ఏడాది పాలనకు 10మార్కులకు 7 మార్కులిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ దీపక్‌ జైసనీ మాట్లాడుతూ ‘‘ ప్రభుత్వ పనితీరు నిర్ధారణకు మార్కెట్-క్యాపిటలైజేషన్ ప్రమాణికం కాదు. మార్కెట్ల పనితీరు కేవలం ప్రభుత్వ పాలసీ మీద మాత్రమే ఆధాపడి ఉండదు. అంతర్జాతీయ పరిణామాలు, నిబంధనలు, అంతరాయాలతో పాటు ఇతర అనేక అంశాలు మార్కెట్లను ప్రభావితం చేస్తాయి.’’అని అన్నారు.

మరిన్ని వార్తలు