మూడు గంటల్లో రూ. 3లక్షల కోట్లు

6 Jan, 2020 17:20 IST|Sakshi

సాక్షి,ముంబై: జియో పొలిటికల్‌ అందోళన నేపథ్యంలో గ్లోబల్‌ మార్కెట్లతో పాటు దేశీయంగా స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాక్‌పై ఆంక్షలు, బెదింపులతో దలాల్‌ స్ట్రీట్‌ అల్లకల్లోలమైంది. సోమవారం మధ్యాహ్నం నాటికి 3లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. ఈ రోజు (సోమవారం) కేవలం మూడుగంటల్లో రూ. 3 లక్షల కోట్లు నష్టపోయారు.  కాగా మధ్యాహ్నం 2.30 సమయానికి బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ. 154 లక్షల కోట్లకు దిగజారింది. గత శుక్రవారం ఈ విలువ రూ. 157 లక్షల కోట్లు.  

సెన్సెక్స్‌ 788 పాయింట్లు, నిఫ్టీ 234 పాయింట్లు పతనమైనాయి. తద్వారా శుక్రవారం ఆల్‌ టైం గరిష్టాన్ని నమోదు చేసిన కీలక సూచీలు సెన్సెక్స్‌ 41వేల కిందికి, నిఫ్టీ 12 వేల దిగువకు చేరింది.  ప్రతి ఐదు  షేర్లలోనాలుగు నష్టపోగా,  స్మాల్ క్యాప్స్ లో ఎక్కువ షేర్లు భారీగా నష్టపోయి లోయర్‌ సర్క్యూట్ కావడం గమనార్హం. 

మరోవైపు ఇరాన్‌ ఉద్రిక్తతలతో బ్రెంట్‌క్రూడ్‌ 70 డాలర్లను చేరడంతో రూపాయి కూడా బలహీననడింది. ఈ పరిస్థితి ఇలాగాఏ కొనసాగితే ముందుగా క్రూడ్‌ 75 డాలర్లను చేరవచ్చని అంచాన. క్రూడ్‌ దెబ్బతో డాలర్‌ పుంజుకోగా, దేశీయ కరెన్సీ బలహీనపడింది. డాలరు మారకంలో రూపాయి  మరోసారి 72 స్థాయి​కి  చేరింది.  ఇరాన్‌ స్పందన తీవ్రంగా ఉంటే ప్రపంచ క్రూడ్‌ సరఫరాలో 20 శాతం మేర దెబ్బతింటుందని, దీంతో క్రూడాయిల్‌ ధర 20 శాతం మేర పెరగవచ్చని అంతర్జాతీయ నిపుణుడు జొనాథన్‌ బారాత్‌  వ్యాఖ్యానించారు.

చదవండి :  ఇరాన్-అమెరికా ఉద్రిక‍్తత :  కుదేలైన రూపాయి

చదవండి : ప్రతీకార హెచ్చరికలు, మార్కెట్ల పతనం

మరిన్ని వార్తలు