ఐవోసీ లాభం రూ. 2,523 కోట్లు

13 Aug, 2014 02:18 IST|Sakshi
ఐవోసీ లాభం రూ. 2,523 కోట్లు

న్యూఢిల్లీ: ఆయిల్ రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో రూ. 2,523 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో రూ. 3,093 కోట్ల నికర నష్టాలు నమోదయ్యాయి. ప్రధానంగా విదేశీ మారక లాభాలు నష్టాల నుంచి బయటపడేందుకు కారణమైనట్లు కంపెనీ చైర్మన్ బి.అశోక్ చెప్పారు.

 గతంలో ఈ పద్దుకింద రూ. 4,024 కోట్ల నష్టం నమోదుకాగా, తాజాగా రూ. 128 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు తెలిపారు. కాగా, ఈ కాలంలో పన్నులకు రూ. 1,028 కోట్లను కేటాయించామని, గతంలో వీటికి ఎలాంటి కేటాయింపులు చేపట్టలేద ని తెలిపారు. అయితే ఆర్‌బీఐ కరెన్సీ స్వాప్ విండో ద్వారా రూ. 745 కోట్లు, రైట్‌బ్యాక్ ద్వారా రూ. 348 కోట్లు, రూ. 556 కోట్లమేర వడ్డీ వ్యయాల్లో ఆదా వంటి అంశాలు లాభాలను సాధించేందుకు దోహదపడినట్లు వివరించారు.

 రూ. 15,328 కోట్ల ఆదాయ నష్టాలు
 ప్రస్తుత సమీక్షా కాలంలో ప్రభుత్వ నియంత్రిత ధరల్లో డీజిల్, ఎల్‌పీజీ, కిరోసిస్ అమ్మకాలవల్ల రూ. 15,328 కోట్ల ఆదాయ నష్టాలు వాటిల్లినట్లు కంపెనీ తెలిపింది. అయితే ఇందుకు ప్రభుత్వం నుంచి రూ. 6,076 కోట్లు, ఓఎన్‌జీసీ వంటి ఉత్పాదక సంస్థల నుంచి రూ. 8,107 కోట్లు సబ్సిడీగా లభించినట్లు వెల్లడించింది.

సబ్సిడీలు సకాలంలో అందడంతో కొంతమేర రుణాలను తిరిగి చెల్లించడం ద్వారా రూ. 556 కోట్లమేర వడ్డీ వ్యయాలను తగ్గించుకున్నట్లు అశోక్ చెప్పారు. వెరసి కంపెనీ రుణభారం రూ. 86,263 కోట్ల నుంచి రూ. 68,953 కోట్లకు తగ్గినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కంపెనీ షేరు 3.6% ఎగసి రూ. 341 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పేమెంట్‌ బ్యాంకులు... ప్చ్‌!

64 ఎంపీ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌

బజాజ్‌ ఆటో కొత్త బైక్‌ : రూ.38 వేలు 

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభంలో 18% వృద్ధి

డైరెక్ట్‌ ప్లానా? రెగ్యులర్‌ ప్లానా?

రూ.18,000 కోట్ల సమీకరణకు యాక్సిస్‌ బ్యాంకు నిర్ణయం

ఈసారి ద్రవ్యోల్బణం 4.1 శాతం

ఏ పరిస్థితులకైనా అనువైన ఫండ్‌

విద్యా రుణానికి మెరుగైన మార్గం

ప్రమోషన్లు, కొత్త నియామకాలు నిలిపివేత

అమ్మకాల  సెగ : భారీ నష్టాలు

ఈ ప్రోత్సహకాలు లాభాన్నిచ్చేవే..!

జొమాటో, స్విగ్గీ పోటా పోటీ

ముకేశ్‌ అంబానీ వేతనం ఎంతంటే..

డాబర్‌ ఇండియాకు కొత్త చైర్మన్‌

‘సోలార్‌’.. కేరాఫ్‌ ప్రాకృతిక్‌ పవర్‌!

షావొమీ ‘గోల్డ్‌’ ఫోన్‌ @ 4.8 లక్షలు

ఫుట్‌బాల్‌ టికెట్లు, వాచీలు..!

ధనాధన్‌ రిలయన్స్‌!

ఇన్వెస్టెర్రర్‌ 2.0

ఆర్‌ఐఎల్‌ ప్రోత్సాహకర ఫలితాలు

ఆర్‌బీఎల్‌ ఫలితాలు భేష్‌..షేరు క్రాష్‌

530 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్లు 

సుజుకీ ‘జిక్సర్‌’ కొత్త వెర్షన్‌

ఎయిర్‌టెల్‌కు మరోసారి జియో షాక్‌

పేటీఎమ్‌ మాల్‌లో ఈబే చేతికి 5.5% వాటా

ఫెడ్‌ రేట్‌ కట్‌ అంచనా : పసిడి పరుగు

ఆర్థిక బిల్లు ఎఫెక్టా? మార్కెట్ల పతనం

లాభాల జోరు : 39 వేల ఎగువకు సెన్సెక్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?