ఐఓసీ లాభం 25% అప్

30 Aug, 2016 00:59 IST|Sakshi
ఐఓసీ లాభం 25% అప్

క్యూ1లో రూ. 8,269 కోట్లు   
1:1 బోనస్ షేర్లు

 న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) కంపెనీ చరిత్రలో అత్యధిక తొలి త్రైమాసిక లాభాన్ని ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికం(2016-17, క్యూ1)లో కంపెనీ నికర లాభం 25 శాతం ఎగసి రూ.8,269 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,591 కోట్లుగా ఉంది. పటిష్టమైన పెట్రోకెమికల్ మార్జిన్‌లతో పాటు ఇన్వెంటరీ(నిల్వలు) సంబంధిత లాభాలు దీనికి దోహదం చేశాయి. 

గతేడాది క్యూ1లో రూ.1,14,200 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.1,07,671 కోట్లకు చేరింది. అయితే, స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్‌ఎం) 10.77 డాలర్ల నుంచి 9.98 డాలర్లకు తగ్గింది. కాగా, ఐఓసీ డెరైక్టర్ల బోర్డు రూ.10 ముఖ విలువగల ఒక్కో షేరుకు ప్రతిగా మరో షేరును(1:1 ప్రాతిపదికన) బోనస్‌గా ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది. ఫలితాల నేపథ్యంలో సోమవారం సల్పంగా 0.3 శాతం నష్టంతో రూ.572 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు