ఐఓసీ నష్టాలు రూ. 5,185 కోట్లు

25 Jun, 2020 03:54 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఐఓసీకి గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో క్వార్టర్‌లో భారీగా నష్టాలు వచ్చాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2018–19) క్యూ4లో రూ.6,099 కోట్ల  నికర లాభం రాగా గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.5,185 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఐఓసీ తెలిపింది. మార్చి క్వార్టర్‌లో చమురు ధరలు బాగా పతనం కావడంతో భారీగా ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయని ఐఓసీ చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ వెల్లడించారు. దీనికి రిఫైనరీ మార్జిన్లు తగ్గడం కూడా తోడవడంతో ఈ స్థాయి నికర నష్టాలు వచ్చాయని వివరించారు. మరిన్ని వివరాలు.....

► 2018–19 క్యూ4లో రూ.1,787 కోట్ల ఇన్వెంటరీ లాభాలు రాగా, గతేడాది క్యూ4లో రూ.14,692 కోట్ల మేర ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయి.  
► క్యూ4లో స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ (జీఆర్‌ఎమ్‌) మైనస్‌ 9.64 డాలర్లకు పడిపోయింది.  
► లాక్‌డౌన్‌ కారణంగా 70 శాతం మేర ఇంధన డిమాండ్‌ తగ్గింది. జూలై మొదటి వారం కల్లా ఈ తగ్గిన 70 శాతం డిమాండ్‌లో 90 శాతం పుంజుకునే అవకాశాలున్నాయి.  
► 2018–19లో రూ.16,894 కోట్లుగా ఉన్న నికర లాభం 2019–20లో రూ.1,313 కోట్లకు తగ్గింది.  
► 2018–19లో రూ.3,227 కోట్ల ఇన్వెంటరీ లాభాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.12,531 కోట్ల నికర నష్టాలు వచ్చాయి.  

 
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐఓసీ షేర్‌ 3% నష్టంతో రూ.87 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు