ఇంటి వద్దకే పెట్రోల్‌,డీజిల్‌?

20 Mar, 2018 09:51 IST|Sakshi
ఇంటి వద్దకే ఇందనం తీసుకొచ్చే వాహనం

రాకెట్‌ వేగంతో దూసుకెళ్తున్న నేటి పోటీ ప్రపంచంలో ఏదైనా కొత్తగా ఆలోచించగలిగితేనే మనుగడ సాధ్యమౌతుంది. సరికొత్త ఆలోచనతో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సంస్థ పెట్రోల్‌ , డీజిల్‌ డోర్‌ డెలివరీ అంటూ మరో​ నూతన ఆవిష్కరణకు తెరలేపింది. ఇంటి వద్దకే ఇంధనాన్ని అందించే కార్యక్రమం మొదలుపెట్టినట్లు తన అధికారక ట్విటర్‌లో పేర్కొంది. 

పుణెలోని వినియోగదారులకు మొదటగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. మరి సాధారణ ధరే ఉంటుందా? సర్వీస్‌ చార్జ్‌ ఏమైనా తీసుకుంటారా? దీని విధివిదానాలు ఎలా ఉంటాయో ఇంకా తెలియాల్సి ఉంది. దూరప్రాంత ప్రజలకు, పెట్రోల్‌, డీజిల్‌ బంక్‌లు అందుబాటులోని గ్రామాలకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. పెట్రోల్‌కు మండే స్వభావం ఎక్కువ ఉంటుంది. పెట్రోల్‌ను డోర్‌ డెలివరీ చేయడం కన్నా డీజిల్‌ను చేయడం సులభం. అందుకే డీజిల్‌ డోర్‌ డెలివరీ అంటూ ప్రారంభించారా అనే  అంచనాలు మార్కెట్‌ వర్గాల్లో  నెలకొన్నాయి.

కొత్త పోకడలు, నూతన ఆలోచనలు..ఇవే వ్యాపారానికి పెట్టుబడులు. ఇలా పుట్టినవే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌.  ఈ కామర్స్‌,  ఆన్‌లైన్‌ రంగాలను ఇవి రెండు ఏలుతున్నాయి. బిగ్‌బాస్కెట్‌, స్విగ్గీ, ఫుడ్‌పాండా వంటి సంస్థలు డోర్‌ డెలివరీ అంటూ మరో ట్రెండ్‌ను సృష్టించాయి. ఇలా వినియోగదారుల సౌలభ్యాలకు ప్రాధాన్యతనిస్తూ, వారి ఆధరణను పొందుతున్నాయి. ఇప్పుడు వీటిస్థానంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ కూడా చేరింది.  అయితే ఒకప్రభుత్వ రంగ సంస్థ ఇలాంటి సేవల్లోకి అడుగుపెట్టడం విశేషం. మరి వినియోగదారులకు ఆకట్టుకోవడంలో ఎంతవరకు సక్సెస్‌ సాధిస్తుందని  అనేది కాలమే చెప్పాలి.

మరిన్ని వార్తలు