పార్క్‌ హయత్‌లో ఐవోటీ ఆధారిత వాటర్‌ ప్లాంట్‌

11 Dec, 2019 01:13 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రముఖ హాస్పిటాలిటీ కంపెనీ హయత్‌ హోటల్స్‌ కార్పొరేషన్‌ దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) ఆధారిత వాటర్‌ ప్యూరిఫికేషన్, బాట్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ‘వాటర్‌హెల్త్‌ ఇండియా’తో ఒప్పందం చేసుకుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను పునర్వినియోగించడం, నీటిని ఆదా చేయడం ఈ యూనిట్‌ ప్రత్యేకతని పార్క్‌ హయత్‌ సౌత్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ థామస్‌ అబ్రహం మంగళవారమిక్కడ విలేకరులతో చెప్పారు. ప్రస్తుతం హయత్‌కు దేశంలో 30 హోటల్స్‌ ఉన్నాయి. వాటర్‌హెల్త్‌ సీఓఓ వికాస్‌ షా మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ఏటా 50 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ విడుదలవుతోందని, ఇది భూమిలో లేదా సముద్రాల్లో కలిసిపోతోందని చెప్పారు. ‘‘2040 నాటికి దేశంలో నీటి సంక్షోభం ఏర్పడే అవకాశముంది. ఎందుకంటే ప్రపంచ జనాభాలో మన వాటా 17 శాతం. కానీ నీటి వనరుల్లో మన వాటా 4 శాతమే’’ అని వివరించారు.

మరిన్ని వార్తలు