ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌

19 Jan, 2018 14:11 IST|Sakshi

ఐఫోన్‌ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌.  బ్యాటరీ లోపాలు,  కొరతతో  ఇబ‍్బందులు పడుతున్న కస్టమర్లు ఇకమీదట ఐఫోన్‌ బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌  తొందరగానే సాధించవచ్చు. అదీ కూడా చాల తక‍్కువ ధరకే.   సుమారు 2 వేల రూపాయలు (అన్ని కలుపుకొని) కే లభించనుంది.  తాజాగా బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌ ఖరీదు అంతర్జాతీయంగా  29 డాలర్లుగా ఉండగా,  మన దేశానికి  సంబంధించి దీని ధర  పన్నులతో కలిపి దాదాపు 2600రూపాయలకు లభించనుంది.

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఐఫోన్‌ కేంద్రాల్లో  ఈ తగ్గింపు ధర వర్తించనుంది. సవరించిన రేట్లకు పాత  ఐఫోన్ మోడళ్లకు బ్యాటరీ  అందుబాటులో ఉన్నట్టు  ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబైలో ఆపిల్‌ కేంద్రాలు ధృవీకరించాయి.  చాలా పాత ఐ ఫోన్లతోపాటు, ఐ ఫోన్‌ 6, 6ప్లస్‌, 6ఎస్‌, ఐఫోన్ 6 ప్లస్,  ఐఫోన్ 7,  ఐఫోన్ 7 ప్లస్ తదితర మిగిలిన మోడళ్లకు  ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇప్పటివరకు దీని రూ . 6,500గా ఉండడంతో పాటు...బ్యాటరీ కోసం దీర్ఘకాలం వెయిట్‌ చేయాల్సి వచ్చేది.  అయితే ఆపిల్ అధీకృత సేవా కేంద్రాల దగ్గర సంబంధిత ఐఫోన్‌ బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌కు అర్హత ఉందా ,  లేదా  అనేది చెక్‌  చేసుకోవాలి. 
 
కాగా ఇటీవల పాత ఐ ఫోన్‌ బ్యాటరీ లోపం కారణంగా ఐ ఫోన్‌  స్లో కావడం, లేదా షట్‌ డౌన్‌ కావడం వివాదం రేపింది.  దీంతో   ఐఫోన్‌ మేకర్‌ ఆపిల్‌ గత నెలలో బ్యాటరీ రీప్లేస్‌ మెంట్‌ పథకాన్ని ప్రారంభించింది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా