మరింత చౌకగా ఐఫోన్‌ ఎస్‌ఈ

26 Dec, 2017 14:03 IST|Sakshi

భారత్‌లో లభ్యమవుతున్న ఆపిల్‌ ఐఫోన్లలో అత్యంత చౌకగా దొరికేది ఐఫోన్‌ ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్‌ మాత్రమే. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం మరింత చౌకగా మారింది. ఐఫోన్‌ ఎస్‌ఈపై భారీగా ధర తగ్గింది. రూ.26వేలుగా ఉన్న  ఐఫోన్‌ ఎస్‌ఈ 32జీబీ వేరియంట్‌ అమెజాన్‌ ఇండియాలో రూ.17,999కే లభ్యమవుతుంది. అంటే రూ.8వేల మేర ధర తగ్గింది. అయితే ఈ ధర కోత అధికారికంగా కాదని, ఆపిల్‌ ఇండియా వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ ధర రూ.26వేలుగానే ఉన్నట్టు తెలిసింది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ కూడా ఐఫోన్‌కు అధికారిక రీసెల్లర్స్‌ కావు.

ఐఫోన్‌ ఎస్‌ఈపై ధర తగ్గడం ఇది రెండోసారి. కస్టమ్‌ డ్యూటీ పెరిగిన నేపథ్యంలో ఐఫోన్లపై రేట్లు పెరిగిన వారంలో, ఐఫోన్‌ ఎస్‌ఈ ధర తగ్గడం విశేషం. అయితే కస్టమ్‌ డ్యూటీ నేపథ్యంలో పెరిగిన ధరల్లో ఐఫోన్‌ ఎస్‌ఈ లేదు.  ధర తగ్గడంతో ఐఫోన్‌ ఎస్‌ఈ ప్రస్తుతం మోటో జీ5ఎస్‌ ప్లస్‌, నోకియా 6, షావోమి ఎంఐ ఏ1 వంటి ఆండ్రాయిడ్‌ ఫోన్ల రేంజ్‌లో దొరుకుతోంది. అంతేకాక ఎక్స్చేంజ్‌లో ఈ ఐఫోన్‌ ఎస్‌ఈపై అమెజాన్‌ రూ.15వేల వరకు తగ్గింపును కూడా ఇస్తోంది.

ఐఫోన్‌ ఎస్‌ఈ ఫీచర్లు...
4 అంగుళాల డిస్‌ప్లే
ఐఓఎస్‌ 11
వెనుక వైపు 12 ఎంపీ ఐసైట్‌ కెమెరా
ముందువైపు 1.2 ఎంపీ కెమెరా
టచ్‌ ఐడీ

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు