ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు

21 May, 2018 15:42 IST|Sakshi

ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్‌ను ప్రారంభించింది. ఆపిల్‌ వీక్‌ సేల్‌ పేరుతో ఈ ఈ-కామర్స్‌ దిగ్గజం వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ సేల్‌లో భాగంగా అతి తక్కువ ధరకు మీ ఫేవరెట్‌ ఆపిల్‌ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా అవకాశం కల్పిస్తోంది. ఐఫోన్లపై మాత్రమే కాక, ఆపిల్‌ 10వ వార్షికోత్సవ ఎడిషన్‌ ఐఫోన్‌ ఎక్స్‌, మ్యాక్‌బుక్స్‌, ఐప్యాడ్స్‌, ఎయిర్‌పాడ్స్‌, ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌లపై కూడా భారీ డిస్కౌంట్లను  ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకుతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న ఆపిల్‌, ఎంపిక చేసిన ఆపిల్‌ ఉత్పత్తులపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్‌, మే 27 వరకు జరుగనుంది. 

ఐఫోన్‌ ఎక్స్‌...
ఆపిల్‌ వార్షికోత్సవ ఎడిషన్‌ ఐఫోన్‌ ఎక్స్‌ను 85,999 రూపాయలకు అందుబాటులోకి తెస్తోంది. ఇది అసలు ధర కంటే నాలుగు వేలు తక్కువ. ఇది 64జీబీ స్టోరేజ్‌ మోడల్‌ ధర. 256జీబీ మోడల్‌ ధర ఐఫోన్‌ను 97,920 రూపాయలకు విక్రయిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్‌ వస్తోంది.
ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌...
ఐఫోన్‌ 8 (64జీబీ మోడల్‌) స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్‌ ధరలో 62,999 రూపాయలకు విక్రయిస్తోంది. 256జీబీ స్టోరేజ్‌ మోడల్‌ను కూడా 73,999కే అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్‌ 8 ప్లస్‌ 64జీబీ స్టోరేజ్‌ మోడల్‌ను 72,999 రూపాయలు అందుబాటులోకి తీసుకురాగ, 256జీబీ మోడల్‌ను 85,999 రూపాయలకు విక్రయిస్తున్నట్టు ప్లిప్‌కార్ట్‌ తెలిపింది.  
ఐఫోన్‌ 6ఎస్‌..
ఐఫోన్‌ 6ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ను 33,999 రూపాయల నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర 40వేల రూపాయలు. ఈ ధర స్పేస్‌ గ్రే, గోల్డ్‌ కలర్‌ వేరియంట్లు మాత్రమే. ఐఫోన్‌ 6ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ 32జీబీ రోజ్‌ గోల్డ్‌, సిల్వర్‌ కలర్స్‌ వేరియంట్లను 34,999 రూపాయలకు అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.
ఐఫోన్‌ ఎస్‌ఈ..
ఈ స్మార్ట్‌ఫోన్‌ 32జీబీ వేరియంట్‌ను 17,999 రూపాయలకే ఫ్లిప్‌కార్ట్‌ విక్రయిస్తోంది. ఆపిల్‌ వీక్‌ సేల్‌లో ఇదే బెస్ట్‌ డీల్‌. అదనంగా కస్టమర్లకు 10 శాతం క్యాష్‌బ్యాక్‌ వస్తోంది. 
ఇతర డీల్స్‌...

  • ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ బ్లూటూత్‌ హెడ్‌సెట్‌ విత్‌ మిక్‌ను 11,499కు విక్రయిస్తోంది
  • ఆపిల్‌ ఇయర్‌పాడ్స్‌ విత్‌ 3.5ఎంఎం హెడ్‌ఫోన్‌ ప్లగ్‌ వైర్డ్‌ హెడ్‌సెట్‌ విత్‌ మిక్‌ను 1,899‍కు అందుబాటులోకి
  • ఆపిల్‌ టీవీ 32 జీబీ మోడల్‌ ఏ 1625ను 14,698 రూపాయలకు విక్రయం
  • 9.7 అంగుళాల ఆపిల్‌ ఐప్యాడ్‌ 32జీబీ మోడల్‌ను 22,900 రూపాయలకు ఆఫర్‌
  • 9.7 అంగుళాల ఆపిల్‌ ఐప్యాడ్‌(6వ జనరేషన్‌)32 జీబీ ని 28వేల రూపాయలకు అందుబాటు
  • ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ల ప్రారంభ ధర 20,900 రూపాయలు
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు