ఐపీవో, ఎఫ్‌పీవో, ఈసాప్‌లకు ఎల్‌టీసీజీ రాయితీ

8 Oct, 2018 01:07 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐపీవోలు, బోనస్, రైట్స్‌ ఇష్యూలు, ఈసాప్‌ల విషయంలో కేంద్రం ఇన్వెస్టర్లకు కాస్తంత వెసులుబాటు ఇచ్చింది. వీటిపై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ) చెల్లించకపోయినప్పటికీ రాయితీతో కూడిన 10 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ)కు అర్హత కల్పించింది. 2018–19 బడ్జెట్లో ప్రభుత్వం రాయితీతో కూడిన 10 శాతం ఎల్‌టీసీజీని షేర్ల అమ్మకంపై ప్రవేశపెట్టింది. లాభం రూ.లక్ష మించితే 10 శాతం ఎల్‌టీసీజీ పన్ను పడుతుంది.

అయితే, కొనుగోలు సమయంలో ఎస్‌టీటీ చెల్లించాలన్న నిబంధన ఉంది. ఎస్‌టీటీ చెల్లింపు కింద తాజాగా వీటికి మినహాయింపు కల్పిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎన్‌ఆర్‌ఐలు, క్యూఐబీలు, వెంచర్‌ క్యాపిటలిస్ట్‌లు సైతం ఎస్‌టీటీ చెల్లించకపోయినా సరే 10 శాతం రేటుకు అర్హులవుతారు. ఎస్‌టీటీ చెల్లించకపోయి, లావాదేవీలు మినహాయింపు జాబితాలో లేకపోతే అప్పుడు షేర్ల విక్రయంపై 20 శాతం ఎల్‌టీసీజీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక స్వల్ప కాలం క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ కింద 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.    

మరిన్ని వార్తలు