ఇది భారత్ శతాబ్ది: ఐబీఎం చైర్మన్ రొమెటీ

14 Jul, 2015 23:54 IST|Sakshi
ఇది భారత్ శతాబ్ది: ఐబీఎం చైర్మన్ రొమెటీ

న్యూఢిల్లీ : పటిష్టమైన స్థూల దేశీయోత్పత్తి, కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ, విస్తృతంగా వస్తున్న స్టార్టప్‌లు.. ఇవన్నీ చూస్తుంటే 21వ శతాబ్దం భారత్‌దే అనిపిస్తోందని టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం చైర్మన్ వర్జీనియా రొమెటీ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాతో పాటు బిగ్ డేటా, అనలిటిక్స్ మొదలైనవి భారత ఆర్థిక వ్యవస్థ, కంపెనీల రూపురేఖలు మార్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ‘ఈ 21వ శతాబ్దం.. భారత శతాబ్దం. ఏదో ఆషామాషీగా కాకుండా.. వాస్తవ పరిస్థితులను బట్టే రేపటి గురించి నేను ఆశావహంగా మాట్లాడుతున్నాను’ అని ఐబీఎం థింక్‌ఫోరమ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రొమెటీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు