కంపెనీల కుమ్మక్కు వల్లే..

28 Dec, 2017 00:58 IST|Sakshi

ఐటీలో ఫ్రెషర్లకు తక్కువ జీతాలు!

మోహన్‌దాస్‌ పాయ్‌ విమర్శ

హైదరాబాద్‌: దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు ప్రారంభ స్థాయి ఇంజనీర్ల వేతనాలు తక్కువగా ఉంచేందుకు కుమ్మక్కయ్యాయని ఐటీ నిపుణుడు, ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో టి.వి.మోహన్‌దాస్‌ పాయ్‌ విమర్శించారు. వేతనాలకు సంబంధించి దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌.ఆర్‌.నారాయణ మూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో పాయ్‌ ఏకీభవించారు. ఐటీ పరిశ్రమలో గత ఏడేళ్లుగా ఫ్రెషర్స్‌ (ప్రారంభ స్థాయి ఉద్యోగులు) వేతనాలు ఏమాత్రం పెరగలేదని మూర్తి ఆరోపించారు. అదే సమయంలో సీనియర్‌ స్థాయిల్లోని ఉద్యోగుల జీతాలు మాత్రం పలు రెట్లు పెరిగాయని పేర్కొన్నారు.

సప్లై ఎక్కువ.. ఇదే కంపెనీలకు వరం..
‘దేశంలో ఇంజనీర్లు ఎక్కువగా ఉన్నారు. ఏటా కొత్తగా వస్తున్న వారి సంఖ్యా ఎక్కువే ఉంది. ఇదే అంశాన్ని ఐటీ కంపెనీలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. ఈ విధానం సరైంది కాదు’ అని పాయ్‌ పేర్కొన్నారు. ‘పెద్ద కంపెనీలు కుమ్మక్కయ్యాయి. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. ఒకరితోనొకరు మాట్లాడుకుంటారు. కొన్నిసార్లు వేతనాలు పెంచొద్దనే అంగీకారానికి వస్తారు’ అని వ్యాఖ్యానించారు. ప్రముఖ ఐటీ కంపెనీలు ప్రారంభ స్థాయి ఉద్యోగుల వేతనాలు పెంచకూడదనే విషయాన్ని పరస్పరం మాట్లాడుకుంటాయనే విషయం తనకు తెలుసన్నారు.

ఏడేళ్లలో సగం తగ్గిన జీతాలు!
ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. గత ఏడేళ్లలో ఐటీ పరిశ్రమలోని ఫ్రెషర్స్‌ వేతనాలు 50 శాతం మేర పడిపోయాయని పాయ్‌ వివరించారు. అందుకే తొలి ఐదేళ్లలో వలసలు ఎక్కువగా ఉంటున్నాయన్నారు. ప్రారంభ స్థాయి ఉద్యోగుల వేతనాలు అక్కడక్కడే ఉన్నందున మంచి టాలెంట్‌ ఉన్న వారు ఐటీ పరిశ్రమలోకి రావడం లేదని తెలిపారు. ‘ప్రముఖ ఐటీ కంపెనీలు మెరుగైన వేతనాలివ్వాలి. ఉన్నత స్థాయి ఉద్యోగులకు అధిక జీతాలివ్వకుండా చూసుకోవచ్చు. మధ్యస్థాయిలో మరింత వేతనాలివ్వాలి. సర్దుబాటు నేర్చుకోవాలి. ప్రారంభ స్థాయి ఉద్యోగుల వేతనాలను పెంచకుండా ఉండటం నైతికంగా తప్పు’ అన్నారాయన. టీసీఎస్, ఇన్ఫోసిస్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఫ్రెషర్స్‌కు మంచి జీతాలు ఇవ్వడానికి ముందడుగు వేయాలన్నారు.  

మెరుగైన వేతనం ఇవ్వాలి..
‘ఫ్రెషర్స్‌ మెరుగైన వేతనం పొందలేకపోవడం చాలా నిరుత్సాహపరుస్తోంది. ఏం చేద్దాం? ఇంజనీర్లు ఎక్కువగా ఉంటున్నారు. వారు చదువులేమో నేరుగా మంచి ఉద్యోగం దక్కించుకోవడానికి సరిపోవడం లేదు. వారికి శిక్షణ అవసరమౌతోంది. ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్‌ శిక్షణ కోసం చాలా డబ్బుల్ని ఖర్చు చేస్తున్నాయి. ఈ పరిస్థితి కొత్తేమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే’ అని పాయ్‌ వివరించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి కనక వారికి మెరుగైన వేతనాలివ్వాలని అభిప్రాయపడ్డారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫార్చూన్‌ 500లో షావోమి

జీవితకాల గరిష్టస్థాయికి పసిడి

పేమెంట్‌ బ్యాంకులు... ప్చ్‌!

64 ఎంపీ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌

బజాజ్‌ ఆటో కొత్త బైక్‌ : రూ.38 వేలు 

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభంలో 18% వృద్ధి

డైరెక్ట్‌ ప్లానా? రెగ్యులర్‌ ప్లానా?

రూ.18,000 కోట్ల సమీకరణకు యాక్సిస్‌ బ్యాంకు నిర్ణయం

ఈసారి ద్రవ్యోల్బణం 4.1 శాతం

ఏ పరిస్థితులకైనా అనువైన ఫండ్‌

విద్యా రుణానికి మెరుగైన మార్గం

ప్రమోషన్లు, కొత్త నియామకాలు నిలిపివేత

అమ్మకాల  సెగ : భారీ నష్టాలు

ఈ ప్రోత్సహకాలు లాభాన్నిచ్చేవే..!

జొమాటో, స్విగ్గీ పోటా పోటీ

ముకేశ్‌ అంబానీ వేతనం ఎంతంటే..

డాబర్‌ ఇండియాకు కొత్త చైర్మన్‌

‘సోలార్‌’.. కేరాఫ్‌ ప్రాకృతిక్‌ పవర్‌!

షావొమీ ‘గోల్డ్‌’ ఫోన్‌ @ 4.8 లక్షలు

ఫుట్‌బాల్‌ టికెట్లు, వాచీలు..!

ధనాధన్‌ రిలయన్స్‌!

ఇన్వెస్టెర్రర్‌ 2.0

ఆర్‌ఐఎల్‌ ప్రోత్సాహకర ఫలితాలు

ఆర్‌బీఎల్‌ ఫలితాలు భేష్‌..షేరు క్రాష్‌

530 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్లు 

సుజుకీ ‘జిక్సర్‌’ కొత్త వెర్షన్‌

ఎయిర్‌టెల్‌కు మరోసారి జియో షాక్‌

పేటీఎమ్‌ మాల్‌లో ఈబే చేతికి 5.5% వాటా

ఫెడ్‌ రేట్‌ కట్‌ అంచనా : పసిడి పరుగు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?