ఇంట్లోనే పనిచేయండి.. ఐటీ కంపెనీల సూచన

3 Jun, 2020 21:49 IST|Sakshi

ముంబై: కరోనా వైరస్‌ విలయతాండవంతో ఐటీ కంపెనీలు ఉద్యోగులను సంరక్షించుకోవడానికి పలు చర్యలు చేపట్టాయి. గత మూడు నెలలుగా ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్(ఇంటి నుంచి పనిచేయడం)‌ ద్వారా విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కరోనా విజృంభిస్తుండడంతో ఉద్యోగులు కార్యాలయాలకు రాకుండా ఇంట్లోనే విధులు నిర్వహించాలని ఉద్యోగులకు ఐటీ కంపెనీలు సూచిస్తున్నాయి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కార్యాలయంలో కేవలం 15శాతం ఉద్యోగులే విధులు నిర్వహిస్తుండగా, మిగతా వారు ఇంట్లోనే తమ సేవలను అందిస్తున్నారు. ఉద్యోగులు ఇంట్లో పనిచేయడం ద్వారా నాణ్యత విషయంలో ఏ మాత్రం మార్పులేదని ఇన్ఫోసిస్‌ సీనీయర్‌ హెర్‌ రిచర్డ్‌ లోబో తెలిపారు.

మిడ్‌ టైర్‌ ఐటీ కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా కార్యాలయానికి రావడం లేదని సంస్థ అధికారులు తెలిపారు. అయినా ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ చేయడం ద్వారా అత్యుత్తమ సేవలందిస్తున్నారని మిడ్‌ టైర్‌ కంపెనీ పేర్కొంది. మరోవైపు వర్క్‌ ప్రమ్‌ హోమ్‌ ద్వారా ఉద్యోగులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నట్లు విప్రో ఓ ప్రకటనలో తెలిపింది. అయితే స్థానిక పరిస్థితుల ఆధారంగానే తమ నిర్ణయాలుంటాయని టెక్‌ మహీంద్రా పేర్కొంది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ద్వారా ఉద్యోగులు మెరుగైన సేవలందిస్తున్నారని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ ఉన్నతాధికారులు తెలిపారు. 

చదవండి: ఐటీ ఉద్యోగులకు అండ..!

మరిన్ని వార్తలు