కెయిర్న్‌ ఎనర్జీకి ఐటీ తాజా నోటీసు

10 Apr, 2017 02:58 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ బ్రిటన్‌కు చెందిన కెయిర్న్‌ ఎనర్జీ పీఎల్‌సీకి తాజా డిమాండ్‌ నోటీసు జారీ చేసింది. రూ.10,247 కోట్లను చెల్లించాలని ఆదేశించింది. ఆదాయపన్ను అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఐటీఏటీ) కెయిర్న్‌ ఎనర్జీకి విధించిన రిట్రోస్పెక్టివ్‌ ట్యాక్స్‌ సబబేనని, దీన్ని చెల్లించాల్సిన బాధ్యత కంపెనీపై ఉందంటూ మార్చి 9న ఆదేశించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. 2006లో కెయిర్న్‌ ఎనర్జీ భారత్‌లోని తన ఆస్తులను కంపెనీ స్టాక్‌ ఎక్సేంజ్‌లలో లిస్టింగ్‌కు ముందు కెయిర్న్‌ ఇండియాకు బదలాయించగా, వచ్చిన మూలధన లాభంపై పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉందని ఐటీఏటీ పేర్కొంది.

మరిన్ని వార్తలు