మైండ్‌ ట్రీ 200% స్పెషల్‌ డివిడెండ్‌

18 Apr, 2019 00:34 IST|Sakshi

న్యూఢిల్లీ: మిడ్‌– సైజ్‌ ఐటీ కంపెనీ మైండ్‌ ట్రీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 9 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.182 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.198 కోట్లకు పెరిగిందని మైండ్‌ట్రీ తెలిపింది. ఆదాయం రూ.1,464 కోట్ల నుంచి 26% వృద్ధితో రూ.1,839 కోట్లకు పెరిగిందని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 32% వృద్ధితో రూ.754కు, మొత్తం ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.7,021 కోట్లకు పెరిగాయని మైండ్‌ట్రీ సీఈఓ, ఎమ్‌డీ రోస్టో రావణన్‌ తెలిపారు.  

వంద కోట్ల డాలర్లు దాటిన వార్షికాదాయం.... 
ఒక్కో షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని రావణన్‌ తెలిపారు. ఈ మధ్యంతర డివిడెండ్‌ను వచ్చే నెల 10లోగా చెల్లిస్తామని, అలాగే ఒక్కో షేర్‌కు రూ.4 తుది డివిడెండ్‌ను కూడా చెల్లించనున్నామని వివరించారు. అంతే కాకుండా  రూ.20 (200%) స్పెషల్‌ డివిడెండ్‌ను కూడా ఇవ్వనున్నామని పేర్కొన్నారు. వార్షికాదాయం వంద కోట్ల డాలర్లు దాటిందని, కంపెనీ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోందని, దీని కారణంగా ఈ స్పెషల్‌ డివిడెండ్‌ను ఇస్తున్నామని వివరించారు. 

రూ.368 కోట్ల డివిడెండ్‌ చెల్లింపులు... 
మొత్తం 16 కోట్ల ఈక్విటీ షేర్లున్నాయని, స్పెషల్‌ డివిడెండ్‌ కింద ప్రమోటర్లకు, వాటాదారులకు రూ.320 కోట్ల మేర చెల్లించనున్నామని ఈ సందర్భంగా రావణన్‌ తెలిపారు. మధ్యంతర డివిడెండ్‌ను కూడా కలుపుకుంటే మొత్తం డివిడెండ్‌ చెల్లింపులు రూ.368 కోట్లకు పెరుగుతాయని వివరించారు. ఈ స్పెషల్‌ డివిడెండ్‌ ప్రతిపాదనకు జూన్‌/జూలైల్లో జరిగే వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొన్నారు. (అప్పటికల్లా ఎల్‌ అండ్‌ టీ ఓపెన్‌ ఆఫర్‌ ముగుస్తుంది) గత ఆర్థిక సంవత్సరంలోనూ, గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లోనూ చెప్పుకోదగ్గ స్థాయి పనితీరు సాధించామని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కంపెనీని ఎల్‌అండ్‌టీ బలవంతంగా టేకోవర్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సోనీ సంచలన నిర్ణయం, యూజర్ల పరిస్థితేంటి?

మోదీ కొత్త సర్కార్‌  కొత్త బిల్లు ఇదేనా?

ఓలా నుంచి ఫుడ్‌పాండా ఔట్‌: ఉద్యోగాలు ఫట్‌

వృద్ధులకు బ్యాంకు వడ్డీపై టీడీఎస్‌ మినహాయింపు

మార్కెట్లో నమో హవా : కొనసాగుతున్న జోరు

‘ఫండ్స్‌’ వ్యాపారానికి అనిల్‌ గుడ్‌బై

ఆర్థిక వృద్ధికి ఊతం

మార్కెట్లో సు‘నమో’! 

ఫిర్‌ ఏక్‌బార్‌ మోదీ సర్కార్‌ : రాకేష్‌ ప్రశంసలు 

టీడీపీ ఢమాల్‌ : బాబు ఫ్యామిలీకి మరో ఎదురుదెబ్బ

 మోదీ ప్రభంజనం​ : మార్కెట్లు జూమ్‌ 

జేకే లక్ష్మీ సిమెంట్‌ లాభం రూ.43 కోట్లు

నాలుగు రెట్లు పెరిగిన బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ లాభం

ఫలితాలకు ముందు అప్రమత్తత

బ్రిటీష్‌ స్టీల్‌ దివాలా 

కోలా, పెప్సీలకు క్యాంపాకోలా పోటీ!

దుబాయ్‌ టికెట్‌ రూ.7,777కే 

డీఎల్‌ఎఫ్‌ లాభం 76% అప్‌ 

62 శాతం తగ్గిన ఇండస్‌ఇండ్‌ లాభం

వాణిజ్య పోరు భారత్‌కు మేలే!

తగ్గిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నష్టాలు

మార్కెట్లోకి టాటా మోటార్స్‌ ‘ఇంట్రా’

లీకైన రెడ్‌మి కే 20 సిరీస్‌.. ఫీచర్లు ఇవే..!

మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ డివైస్‌లపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు

 2 వారాల కనిష్టానికి పసిడి

అందుబాటులోకి ‘నోకియా 3.2’ స్మార్ట్‌ఫోన్‌

జియో, ఎయిర్‌టెల్‌కు కౌంటర్ : వొడాఫోన్ సూపర్ ఆఫర్

రిలయన్స్‌ రిటైల్‌: ఆన్‌లైన్‌ దిగ్గజాలకు గుబులే

ఫ్లాట్‌నుంచి సెంచరీ లాభాల్లోకి.. 

మార్చిలో 8.14 లక్షల మందికి ఉద్యోగాలు: ఈపీఎఫ్‌ఓ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వైఎస్‌ జగన్‌కు మహేశ్‌ అభినందనలు

నటన రాదని అమ్మతో చెప్పా!

యువ సీఎంకు అభినందనలు

మోదీ మాసివ్‌ విక్టరీ : కంగనా ఏం చేశారంటే..

రియల్‌ హీరో..

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను