ఆటో ఎక్స్ పో... సందర్శకుల తాకిడి

6 Feb, 2016 01:51 IST|Sakshi
ఆటో ఎక్స్ పో... సందర్శకుల తాకిడి

మొదటి రోజు 80 వేల మంది
గ్రేటర్ నోయిడా: ఆటో ఎక్స్‌పోను శుక్రవారం 80 వేల మంది సందర్శించారు. ఈ ఆటో షోకు  శుక్రవారం నుంచి మంగళవారం(ఈ నెల 9) వరకూ ప్రజలను అనుమతిస్తారు. ఇక్కడి ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో జరుగుతున్న ఈ ఆటో షోను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్), ఆటోమోటివ్ కాంపొనెంట్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్(ఏసీఎంఏ), కాన్ఫెడరేషన్ ఆప్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. భారత వాహన మార్కెట్లోకి రానున్న తాజా, ఉత్తమ వాహనాలను చూడటానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని సియామ్ పేర్కొంది.

 సూపర్ బైక్‌ల సెక్షన్‌ను చూడ్డానికి జనం బాగా వచ్చారని నిర్వాహకులు వెల్లడించారు. పురాతన వాహనాలతో కూడిన వింటేజ్ కార్ పెవిలియన్ కూడా పలువురిని ఆకర్షించింది. వీధి నాటకాలు, తోలు బొమ్మలాటల ద్వారా రోడ్డు భద్రతపై సందర్శకులకు అవగాహన కల్పించే  కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఆటో ఎక్స్‌పోలో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్, హోండా కార్స్, ఆడి తదితర కంపెనీలు వాహనాలను ప్రదర్శిస్తున్నాయి.

మరిన్ని వార్తలు