ఐటీ రిటర్న్‌కు ఆన్‌లైనే మేలు!

25 May, 2015 01:46 IST|Sakshi
ఐటీ రిటర్న్‌కు ఆన్‌లైనే మేలు!

- 1-3 నెలల్లోనే రీఫండ్ చేతికి  
- అదే ఆఫ్‌లైన్‌లో అయితే 5-10 నెలల సమయం

రిఫండ్ అంటే... వెనక్కివ్వటం. ఆదాయపు పన్ను విషయంలో అయితే... చెల్లిం చాల్సిన పన్నుకన్నా ఎక్కువ చెల్లించినపుడు దాన్ని వెనక్కి తీసుకునేందుకు రిఫండ్ క్లెయిమ్ చేయొచ్చు. ఆన్‌లైన్లో, మాన్యువల్‌గా రెండు రకాలుగానూ పన్ను రిటర్న్‌లు దాఖలు చేసే అవకాశం ఉన్నా... ఆన్‌లైన్ ద్వారా దాఖలు చేసిన రిటర్న్‌ను పన్ను అధికారులు భౌతికంగా తనిఖీ చేయరు కనక 1-3 నెలల్లోపు రిఫండ్ మొత్తం చేతికొస్తుంది. మాన్యువల్‌గా దాఖలు చేసిన రిటర్న్‌ల విషయంలో దీనికి 5-10 నెలలు పడుతుంది.

రిఫండ్‌ను వేగంగా తెచ్చుకోవటమెలా?
రిటర్న్ వేసేవారు తొలుత ఐటీ విభాగ డాటాబేస్‌లో తాము చెల్లించిన పన్ను వివరాలు సరిచూసుకోవాలి. వ్యక్తిగతంగా లాగిన్ అయి... ఫారమ్ 26 ఎఎస్‌ను చూస్తే మనం చెల్లించిన పన్ను వివరాలు తెలుస్తాయి. సరైన చిరునామాతో పాటు ఫోన్ నంబరు, ఈ-మెయిల్, బ్యాంకు ఖాతా వివరాలు కరెక్టుగా ఇవ్వాలి. ఇక ఐటీఆర్-5 ఫారాన్ని బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్‌కు పంపటం తప్పనిసరి. అక్కడి నుంచి క్లియర్ అయ్యాకే రిఫండ్ వస్తుంది కనక. ఒకవేళ రిఫండ్ నేరుగా బ్యాంకు ఖాతాకే జమ కావాలనుకుంటే ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ పద్ధతి (ఈసీఎస్) ఎంచుకోవాలి. వేగవంతమైన రిఫండ్‌కు అదే కరెక్టు. ఒకవేళ చెక్కు ద్వారా పొందాలనుకుంటే మారే చిరునామా కాకుండా శాశ్వత చిరునామా ఇవ్వటం మంచిది. అయితే రిఫండ్ మొత్తం రూ. 50 వేలు దాటితే ఈసీఎస్ పద్ధతి పనికిరాదు. చెక్కు ద్వారానే అందుతుంది.

అసలు సమస్య ఇక్కడే..
అసలు ఆదాయానికి, ఆదాయపు పన్ను చెల్లించడానికి లెక్కించిన ఆదాయానికి మధ్య తేడాలుండటం వల్లే చాలా రిఫండ్‌లు ఆలస్యమవుతుంటాయి. దీంతో ఈ విషయం ఐటీ విభాగం సెక్షన్ 143(1) కింద తెలియజేస్తుంది. ఐటీ రిటర్న్ దాఖలు చేయడానికి సరైన సాఫ్ట్‌వేర్‌ను ఎంచుకోవటం ద్వారా ఈ రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. అవసరమైన వారు నిపుణుల సాయం కూడా తీసుకోవచ్చు. కొన్ని ఆన్‌లైన్ సంస్థలూ ఈ సౌకర్యం కల్పిస్తున్నాయి. అవి వేగంగా రిఫండ్ రావటానిక్కూడా సహకరిస్తాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్థిక బిల్లు ఎఫెక్టా? మార్కెట్ల పతనం

లాభాల జోరు : 39 వేల ఎగువకు సెన్సెక్స్‌

డుమాంట్‌.. ప్రీమియం ఐస్‌క్రీమ్స్‌

ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ లాభం 359 కోట్లు

అకౌంట్లతో పనిలేదు..

అలహాబాద్‌ బ్యాంకులో మరో మోసం

తప్పనిసరై జాతీయం.. తప్పులతో పతనం

ఫేస్‌ స్లిమ్మింగ్‌ ఫీచర్‌తో ఒప్పో ఏ9

మరో కుంభకోణం : షేర్లు ఢమాల్‌

నిజామాబాద్‌లో వాల్‌మార్ట్‌ ప్రారంభం

ఇంటెలిజెంట్‌ వెహికల్స్‌ రయ్‌!

ఎలక్ట్రిక్‌ వాహన బ్యాటరీలు... తెలంగాణకు 3 కంపెనీలు

ఈబిక్స్‌ చేతికి యాత్రా ఆన్‌లైన్‌

భారత్‌కు మాల్యా : బిగ్‌ బ్రేక్‌

భారీగా పతనమైన యస్‌ బ్యాంక్‌ షేరు

నష్టాల్లో సూచీలు : బ్యాంకుల జోరు

హ్యుందాయ్‌ ‘కోనా’ ధర భారీగా తగ్గనుందా?

విప్రో లాభం 2,388 కోట్లు

దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం

అజీం ప్రేమ్‌జీ అండతో ఆ స్టార్టప్‌ అరుదైన ఘనత

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!