ఐటీ లేఆఫ్స్: గోరంతైతే, కొండంత చేస్తున్నారు

25 May, 2017 16:48 IST|Sakshi
ఐటీ లేఆఫ్స్: గోరంతైతే, కొండంత చేస్తున్నారు
ఐటీ పరిశ్రమలో ఇటీవల నెలకొన్న లేఆఫ్స్ ఆందోళన తెలిసిందే. భారీ ఎత్తున్న కంపెనీలు ఉద్యోగాలు పీకేస్తున్నారంటూ పలు రిపోర్టులు టెకీల గుండెల్లో దడలు పుట్టిస్తున్నాయి. అయితే ఐటీ పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి అతిశయోక్తిగా ఉందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ''పర్ ఫార్మెన్స్ ఆధారంగా సాధారణంగా ఉద్యోగులపై వేటు వేయడం ప్రతి ఇండస్ట్రిలో ఓ అంతర్గత భాగం. దీన్ని మరీ అతిశయోక్తి చేయడం అంత మంచిది కాదు. ఆందోళన చెందడానికి ఎలాంటి కారణాలు లేవు. సాధారణంగా జరిగే ప్రక్రియను కొండంత చేసి చూస్తున్నారు'' అని మంత్రి చెప్పారు.
 
తమ మంత్రిత్వశాఖ లేఆఫ్స్ పరిస్థితిపై ఎప్పడికప్పుడూ దేశీయ ఐటీ సీఈవోలతో సంప్రదిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐటీ పరిశ్రమలో ప్రత్యక్షంగా 40 లక్షల మందికి, పరోక్షంగా 1.6 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పారు.  సాఫ్ట్ బ్యాంకు, అమెజాన్, అలీబాబాలతో దేశీయ స్టార్టప్ స్పేస్ రన్ అవడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టంచేశారు. ఇంటర్నెట్ స్పేస్ లో విదేశీ నగదు ఫండింగ్ కు వ్యతిరేకంగా భారత్ ఎలాంటి పక్షపాతం చూపించదని పేర్కొన్నారు.  
>
మరిన్ని వార్తలు