సూచీలకు అండగా ఐటీ షేర్ల ర్యాలీ

7 Jul, 2020 10:15 IST|Sakshi

ఇన్ఫోసిస్‌ 3శాతం జంప్‌

పరిమిత శ్రేణి మార్కెట్లో మంగళవారం ఐటీ షేర్లు రాణిస్తున్నాయి. ఐటీ షేర్ల ర్యాలీ సూచీల పతనాన్ని అడ్డుకుంటుంది. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత ఇందుకు కారణవుతోంది.  ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతానికి పైగా లాభపడి 15801 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. పారెక్స్‌ మార్కెట్లో నేడు రూపాయి విలువ నిన్నటి ముగింపు(74.64)తో పోలిస్తే ఒక దశలో 18పైసలు బలహీపడింది. రూపాయి బలహీనతో డాలర్‌ మారకంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ కంపెనీలకు కలిసొచ్చే అంశమని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కరోనా సంక్షోభం తర్వాత ఐటీ కంపెనీలు భారీగా కాంట్రాక్టులు దక్కించుకోవచ్చనే ఐటీ నిపుణుల అంచనాలు ఈరంగ షేర్లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఫలితంగా నేడు మార్కెట్‌ ప్రారంభంలోనే ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఉదయం 10గంటలకు ఇండెక్స్‌ మునుపటి ముగింపు(15464.95)తో పోలిస్తే 2శాతం లాభంతో 15,787 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ రంగానికి చెందిన ఎన్‌ఐఐటీ టెక్‌ షేరు 8.50శాతం పెరిగింది. ఇన్ఫోసిస్‌ 3శాతం లాభపడింది. నౌకరీ, మైండ్‌ ట్రీ, విప్రో, టెక్‌ మహీంద్రా షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, ఎల్అండ్‌టీ ఇండియా, ఎంఫసీస్‌ షేర్లు 1శాతం నుంచి అరశాతం లాభపడ్డాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా