జూలై 1నుంచి జీఎస్‌టీ అమలు సాధ్యమేనా?

10 Jun, 2017 19:10 IST|Sakshi
జూలై 1నుంచి జీఎస్‌టీ అమలు సాధ్యమేనా?

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద  టాక్స్ సంస్కరణగా చెబుతున్న  గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ చట్టం అమలుపై వివిధ పరిశ్రమ వర్గాలు, ప్రజల్లో  ఉత్కంఠ నెలకొంది. ఇంకా మూడు వారాలే సమయం ఉండటంతో  జూలై 1నుంచి అమలు సాధ్యపడుతుందా లేదా అనే సందేహాలు  వ్యక్తమవుతున్నాయి.  ఈ నేపథ్యంలో జీఎస్‌టీ అమలుకు కీలకమైన ఐటీ  వ్యవస్థను సిద్ధంగా లేదనే అంచనాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన నెట్‌వర్క్‌ పని ఇంకా పూర్తికాలేదని జీఎస్‌టీ సువిధ  ప్రొవైడర్స్‌ చెబుతున్నారు.

శుక్రవారం జీఎస్‌టీఎన్‌ అధికారులు ,  సువిధ ప్రొవైడర్స్ మధ్య సమావేశం జరిగింది. ఇందులో  జీఎస్‌టీ అనుకున్న తేదీనుంచి అమలు చేయాలన్న ధీమా వ్యక్తమైనప్పటికీ  ఐటీ  సంసిద్ధతపై సందేహాలు వ్యక్తమయ్యాయి.   ముఖ‍్యంగా జీఎస్‌టీ నెట్వర్క్,  జీఎస్‌టీ ఐటీ సిస్టం సిద్ధంగా లేదని,   పన్నుల శ్లాబుల ఖరారు తర్వాత మాత్రమే జిఎస్టి సువిధా ప్రొవైడర్లు (జీఎస్‌పీ) లను సిద్ధంగా  ఉంచగలమని టాలీ సొల్యూషన్స్ వద్ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తేజాస్ గోయెంకా ఐఎన్‌ఎస్‌కి చెప్పారు.   అలాగే జీఎస్‌టీలోని పలు అంశాలపై నిర్ణయాలు కొన్ని  అంశాలు మాత్రమే కొన్ని రోజుల క్రితం ప్రకటించబడ్డాయి, ఇంకా కొన్ని  అంశాలపై క్లారిటీ రావాల్సి ఉందనీ   అందువల్ల జూలై 1 అమలు కష్టతరమనిపిస్తోందని ఎక్సెల్లాన్‌  సీవోవో వినోద్‌ తంబి పేర్కొన్నారు.
ఐటి సంసిద్ధంగా లేకపోవటంతో జూలై 1నుంచిజీఎస్‌టీ అమలు విఫలమయ్యేటట్టు కనిపిస్తోందని  సిగ్నెట్ ఇన్ఫోటెక్ వ్యవస్థాపకుడు , డైరెక్టర్  నీరజ్ హుథే సింగ్‌  అభిప్రాయపడ్డారు.  దీంతో అమలు తేదీ దగ్గరపడుతుండటంతో  మార్కెట్‌ వర్గాల భయాలు  నిజంకాననున్నాయనే అనుమానాలను వ్యక్తం చేశారు. ఇంకా 20 రోజులే  మిగిలి ఉన్నప్పటికీ పన్నులరేట్లు, నిబంధనలపై నిర్ణయాలు   పూర్తికాలేదనీ,  ఇది   సువిధ ప్రొవైడర్లు  టెస్టింగ్‌  అవసరాల్ని దెబ్బతీస్తోందని ఎనలిస్టు ప్రీతమ్‌ మాధురే వ్యాఖ్యానించారు.  ఈ సాఫ్ట్‌వేర్‌పై గణనీయమైన పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
మరోవైపు పశ్చిమబెంగాల్‌ ఆర్థికమంత్రి అమిత్‌మిత్రా కూడా జూలై 1 నాటికి ఐటి సంసిద్ధత గురించి తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. మొత్తం జీఎస్‌టీ జీఎస్‌టీ నెట్‌వర్క్‌ సంబంధించిన ఐటి వ్యవస్థపై ఆధార పడి ఉందని మిత్రా చెప్పారు.  దేశవ్యాప్తంగా మొత్తం 34 సువిధ  ప్రొవైడర్లను నియమించామని, తాజా అంచనాల ప్రకారం వీరికి ఇంకా సమయం కావాల్సి వస్తుందన్నారు.  ఈ నేపథ్యంలో 34 జీఎస్‌పీలు సరిపోతాయా అనే  సందేహాలను ఆయన వ్యక్తం చేయడం గమనార‍్హం.

కాగా జీఎస్‌టీ బిల్లును జూలై 1  నుంచి  ఎలాగైనా అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది.  ఈ క్రమంలో జీఎస్‌టీ అమలుకు సంబంధించిన కసరత్తును శరవేగంగా పరుగులు తీయిస్తోంది.  జూలై 1నుంచి అమలు  చేసేందుకు అన్ని రాష్ట్రాలు అంగీకారం తెలిపాయని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఇటీవల ప్రకటించారు. జైట్లీ నేతృత్వంలోని  జీఎస్‌టీ కౌన్సిల్‌ రేపు (ఆదివారం) తుది సమావేశం కానున్న  సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు