ఐటీసీ ఫలితాలు వచ్చాయ్‌... కొనాలా? అమ్మాలా?

29 Jun, 2020 15:58 IST|Sakshi

బ్రోకరేజ్‌ సంస్థల అభిప్రాయాలు

1శాతం లాభంతో ముగిసిన షేరు

ఐటీసీ కంపెనీ శనివారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికపు ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ4లో స్టాండ్‌అలోన్‌ ప్రాతిపదికన కంపెనీ రూ.3,797 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవతర్సంలో కంపెనీ ఆర్జించిన నికర లాభంతో పోలిస్తే ఇది 6.5శాతం అధికం. మార్చి చివరి వారంలో విధించి లాక్‌డౌన్‌ కారణంగా నిర్వహణ ఆదాయం 6.4శాతం క్షీణంచి రూ.11,420 కోట్లకు పరిమితమైంది. ఇదే క్వార్టర్‌లో ఈబీఐటీడీఏ 8.9శాతం క్షీణించి రూ.4,163.5 కోట్లుగా నమోదైంది. మార్చి క్వార్టర్‌ ఫలితాల ప్రకటన తర్వాత సోమవారం ఇంట్రాడేలో ఈ షేరు  4శాతం లాభపడి, చివరికి 1శాతం లాభంతో రూ.197 వద్ద సిర్థపడింది. ఈ నేపథ్యంలో వివిధ బ్రోకరేజ్‌ సంస్థలు ఐటీసీపై అభిప్రాయాలను వెలువరిచాయి. 

1.బ్రోకరేజ్‌ సంస్థ: జెఫ్పారీస్‌ 
రేటింగ్‌: బై
టార్గెట్‌ ధర: రూ.240
విశ్లేషణ: కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌ విధింపు ప్రభావంతో వార్షిక ప్రాతిపదికన సిగరెట్‌ అమ్మకాల వ్యాల్యూమ్స్‌ 10శాతం క్షీణతను చవిచూశాయి. అయితే ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ సింగిల్‌ డిజిట్‌ వృద్ధిని నమోదు చేయడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు మరింత దారుణంగా ఉండొచ్చు. ఏది ఏమైనా కంపెనీ డివిడెండ్‌ ఈల్డ్‌ 5శాతం ఉండటం షేరును ఆకర్షణీయంగా మార్చింది. 

2. బ్రోకరేజ్‌ సంస్థ: మెక్వ్యెరీ
రేటింగ్‌: అవుట్‌ఫెర్‌ఫామ్‌
టార్గెట్‌ ధర: రూ.232
విశ్లేషణ: కోవిడ్‌-19 తొలి దశ అమ్మకాలతో పోలిస్తే ఈ జూన్‌లో సిగరెట్‌ అమ్మకాల రికవరీ 85-90శాతంగా ఉండొచ్చు. తన ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌ఎంసీజీ వ్యాపారంలో అత్యుత్తమంగా రాణించవచ్చు. కంపెనీ డివిండ్‌ ఈల్డ్‌ 5శాతం ఉండటం షేరును ఆకర్షణీయంగా మరింత మార్చింది.  

3. బ్రోకరేజ్‌ సంస్థ: సీఎల్‌ఎస్‌ఏ
రేటింగ్‌: అవుట్‌ఫెర్‌ఫామ్‌ 
టార్గెట్‌ ధర: రూ.220
విశ్లేషణ: స్వల్ప కాలం పాటు కఠినమైన పరిస్థితులు ఎదుర్కోంటుంది. ఆర్థిక సంవత్సరం 2020లో ఒక్కొక్క షేరుకు డివిడెండ్‌ చెల్లింపు 88శాతానికి పెరగడం షేరు తదుపరి ర్యాలీకి ఉత్సాహాన్నిచ్చే అంశం. 

4.బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌ సర్వీసెస్‌
రేటింగ్‌: న్యూట్రల్‌
టార్గెట్‌ ధర: రూ.190
విశ్లేషణ: ఆర్థిక సంవత్సరం 2020 నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాల కన్నా తక్కువగానే ఉన్నాయి. లాక్‌డౌన్‌తో సమయంతో పోలిస్తే ప్రస్తుత సిగరెట్‌ అమ్మకాల వాల్యూమ్స్‌ సాధారణ స్థితికి వచ్చాయి. అయితే రాబోయే కొద్ది నెలల్లో మరింత జీఎస్‌టీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ.

1. ఐటీసీ మొత్తం లాభదాయకత కేవలం సిగరెట్లపై ఆధారపడి ఉంది.
2. జీఎస్టీ పెరుగుదల భయాలతో ఇప్పటికే ఎఫ్‌వై 20-22లో బలహీనమైన ఆదాయ వృద్ధి అంచనాల ప్రమాదం నెలకొంది. ఈ కారణాలతో షేరుకు న్యూట్రల్‌ రేటింగ్‌ను కేటాయించడమైంది.

మరిన్ని వార్తలు