చాక్లెట్‌@:రూ.4.3 లక్షలు

23 Oct, 2019 04:32 IST|Sakshi

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌ తయారు చేసిన ఐటీసీ

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ కంపెనీ ‘ఐటీసీ’.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌ను తయారు చేసింది. ఈ కంపెనీకి చెందిన ఫాబెల్లె బ్రాండ్‌ ‘ట్రినిటీ – ట్రఫుల్స్‌ ఎక్స్‌ట్రార్డినేర్‌’ పేరిట చాక్లెట్‌ను రూపొందించగా.. దీని ఖరీదు కేజీ రూ. 4.3 లక్షలుగా ప్రకటించింది. ఇంతటి ఖరీదైన చాక్లెట్‌ మరొకటి లేనందున గిన్నిస్‌ బుక్‌లో ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ స్థానం సంపాదించినట్లు కంపెనీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. చేతిలో సరిపడే ఒక్కో చెక్క పెట్టెలో 15 ట్రఫుల్స్‌ ఉండగా.. సగటు బరువు దాదాపు 15 గ్రాములు ఉన్నట్లు తెలిపింది. ఈ విధంగా ఒక కిలో రేటును నిర్ణయించినట్లు తెలిపింది. కేవలం భారత్‌కే పరిమితం కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించినందుకు సంతోషంగా ఉందని ఐటీసీ ఫుడ్‌ డివిజన్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అనుజ్‌ రుస్తాగి అన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు