అదరగొట్టిన ఐటీసీ

27 Oct, 2017 16:05 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద సిగరెట్‌  మేకర్‌, ఎఫ్‌ఎంసీజీ రంగ సంస్థ ఐటీసీ లిమిటెడ్ లాభాలు విశ్లేషకుల అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఐటీసీ నికర లాభం దాదాపు 6 శాతం ఎగిసి రూ .2,640 కోట్లకు పెరిగింది. . గత ఏడాది ఇదే కాలంలో రూ .2,500 కోట్లను ఆర్జించింది.

 సెప్టెంబర్ త్రైమాసికంలో  రెవెన్యూ కూడా7 శాతం పెరుగుదలను నమోదు  చేసింది.  గత ఏడాది ఇదే క్వార్టర్‌ ఆదాయం రూ.  9,661కోట్లతో పోలిస్తే రూ .10,314 కోట్లను నమోదు చేసింది.  ఈ త్రైమాసికంలో  వ్యవయాలను భారీగా తగ్గించుకున్నట్టు ఐటీసీ తెలిపింది. 39 శాతం  క్షీణించిన ఖర్చులు 6,314 కోట్లకు  దిగి వచ్చాయి. అయితే ఎఫ్‌ఎంసీజీ ఆదాయం మాత్రం భారీగా క్షీణించింది.  సిగరెట్లతో సహా ఎప్‌ఎంసీజీ ద్వారా ఆదాయం రూ.7,358కోట్లుగా ఉండగా గత ఏడాది  రూ.11,200కోట్లుగాఉంది. హోటల్ బిజినెస్‌ ఆదాయం పెరిగింది.   రూ.  297.ద్వారా ఉన్న ఆదాయం రూ.300 కోట్లకు పెరగింది. అలాగే అగ్రి బిజినెస్‌ ఆదాయం  కూడా రూ.1,880కోట్ల నుంచి రూ.1,968 కోట్లకు పెరిగింది

మరోవైపు  ఫలితాల ప్రకటనతో లాభాల ఆర్జించిన ఐటీసీ షేరు మార్కెట్‌ క్లోజింగ్‌లో ఐటీసీ షేరు స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది.

మరిన్ని వార్తలు