అదిరే ఫీచర్లతో ఐవోమి స్మార్ట్‌ఫోన్లు

10 Jan, 2018 01:13 IST|Sakshi

ప్రారంభ ధర రూ.5,999  

న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘ఐవోమి’ తాజాగా ‘ఐ1’, ‘ఐ1ఎస్‌’ అనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వీటి ధర వరసగా రూ.5,999, రూ.7,499గా ఉన్నాయి. ఐ1లో 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ, ఐ1ఎస్‌లో 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ వంటి ఫీచర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది.

రెండింటిలోనూ 3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 7.0 నుగోట్‌ ఓఎస్, 5.45 అంగుళాల హెచ్‌డీ ఇన్‌ఫినిటీ ఎడ్జ్‌ డిస్‌ప్లే, 13 ఎంపీ+ 2 ఎంపీ డ్యూయెల్‌ రియర్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా వంటి పలు ప్రత్యేకతలున్నాయని పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ల తొలి ఫ్లాష్‌ సేల్‌ బుధవారం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభంకానుంది. వినియోగదారులు లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా ఐ1ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ను రూ.6,999కే పొందొచ్చు.

మరిన్ని వార్తలు