ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ!

4 Jul, 2018 14:20 IST|Sakshi

చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ ఐవోమి తన సరికొత్త ఫోన్‌ని భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ‘ఐ2 లైట్‌’ పేరుతో ఈ ఫోన్‌ విడుదల చేసింది. ఈ ఫోన్‌ నేటి(బుధవారం) నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కేవలం 6,499 రూపాయలకే బడ్జెట్‌ ధరలో లభిస్తున్న ఈ ఫోన్‌లో ఫీచర్‌లు మాత్రం అదిరిపోయేలా ఉన్నాయని కంపెనీ అధికారులు తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 5.42 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే 18:9 యాక్సెప్ట్‌ రేషియో కలిగి ఉంది. మెయిన్‌స్ట్రీమ్‌ ఫోన్లు ఆఫర్‌ చేసే అన్ని ఫీచర్లను ఈ స్మార్ట్‌ఫోన్‌ అందిస్తోంది. ఈ ఫోన్‌ టాప్‌ ఫీచర్‌ అతిపెద్ద 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ.

ఫేస్‌ అన్‌లాక్‌, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ వంటి ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌లోనూ ఉన్నాయి. 1.5 గిగాహెడ్జ్‌ ​క్వాడ్‌ కోడ్‌ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ రూపొందింది. 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌తో పాటు 128 జీబీ ఎక్స్‌పాండబుల్‌ మెమరీని ఇది కలిగి ఉంది. 2 మెగాపిక్సెల్‌, 13 మెగాపిక్సెల్‌లలో రెండు రియర్‌ కెమెరాలతో పాటు 8 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. పలుచైన బడ్జెట్‌ ఫోన్లలలో ఇదీ ఒకటి. ఈ స్మార్ట్‌ ఫోన్‌ మెర్క్యూరి బ్లాక్‌, సాటన్‌ గోల్డ్‌, మార్స్‌ రెడ్‌, నెప్ట్యూన్‌ బ్లూ వంటి నాలుగు వేర్వేరు రంగుల్లో లభ్యం కానుందని ఐవోమి కంపెనీ తెలిపింది.

మరిన్ని వార్తలు