వారానికి ఏడుసార్లే. మరోసారి వార్తల్లో ట్విటర్‌ సీఈవో

16 Jan, 2020 13:26 IST|Sakshi

సెలబ్రెటీల జీవన విధానాలు తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో సోషల్‌ మీడియా  వేదికగా ట్విటర్‌ సీఈవో  జాక్‌ డోర్సీ  మరోసారి తన ఆరోగ్యం, ఆహారంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తను వారానికి ఏడుసార్లు మాత్రం భోజనం చేస్తానని వెల్లడించి వార‍్తల్లో నిలిచాడు.

డార్సే బుధవారం యూట్యూబ్‌  యూజర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ  పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అలాగే ఆహార నియమాల గూర్చి మరోసారి ట్విటర్‌ వేదికగా పంచుకున్నాడు. తాను వారంలో ఏడు సార్లు భోజనం చేస్తానని..అది కూడా రాత్రి డిన్నర్‌ మాత్రమే చేస్తానని తెలిపారు. దైనందిన జీవన శైలిలో యోగ విపాసనను పాటిస్తానని..అప్పుడప్పుడు ఉపవాసాలు కూడా ఉంటానని తెలిపాడు. తాను నిత్యం ఐస్‌ బాత్‌తో (మంచు) స్నానం చేసి రెండు గంటల పాటు ధ్యానం చేస్తానని అన్నాడు. ఈ సందర్భంగా  చాలా ప్రశ్నలు ఎడిట్‌ బటన్‌, స్పెల్‌ చెక్‌ లాంటి సాంకేతిక అంశాలపై అడిగినప్పటికీ, వ్యక్తిగత ప్రశ్నలు, ఆయన జీవన శైలికి  సంబంధించిన అంశాలు ఆసక్తికరంగా మారాయి. కొంత మంది నెటిజన్లు ఆయనపై సెటైర్లు కూడా పేల్చారు. గతంలోవారానికి అయిదుసార్లు అని ప్రకటించిన డోర్సీ, ఇపుడు ఆ కోటాను 7కు పెంచాడని చమత్కరించడం గమనార్హం. 

తన ఆహారంలో (డిన్నర్‌) చేపలు, చికెన్, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటానని గత మార్చిలో చెప్పిన విషయం తెలిసిందే. తాను ప్రతి రోజు ఉత్సాహంగా పని చేస్తానని..ఈ నేపథ్యంలోనే  మంచంపై ఒరిగిన పది నిముషాల్లోనే నిద్ర తనను పలకిరస్తుందని చెప్పుకొచ్చారు. ప్రతి రోజు విటమిన్‌ ‘సీ’ ని తీసుకుంటానని అన్నారు. ఉదయం ఐస్‌బాత్ చేస్తానని దీంతో కేవలం పదిహేను నిముషాల్లోనే తన మెదడు ఉత్సాహవంతంగా పనిచేస్తుందని అన్నారు. సాయంత్రం మరోసారి మూడు నిమిషాల పాటు ఐస్‌ బాత్‌ చేసి సేద తీరుతానని డోర్సీ తెలిపారు.
చదవండి: ట్విటర్‌ సీఈవో అకౌంట్‌ హ్యాక్‌

మరిన్ని వార్తలు